ఇంద్ర ధర్మరాజులసంభాషణ: - అచ్యుతుని రాజ్యశ్రీ


 ధర్మరాజు ఆనరకకూపంలో అక్కడ ఉండగానే ఇంద్రాదిదేవతలు వచ్చారు.సుగంధవాయువులు వీచసాగాయి. ఇంద్రుడు ధర్మరాజుని ఓదార్చసాగాడు"ధర్మజా! నీవు నరకాన్ని చూశానని బాధపడకు. ముందుగా శుభ కర్మలఫలాన్ని అనుభవిస్తే,నరకం అనుభవించక తప్పదు.పుణ్యం అధికంఉన్నవారు ముందు నరకంచూసి స్వర్గంలో సుఖాలు అనుభవిస్తారు.  నీమేలు కోసమేముందు నీకు నరకాన్ని చూపాను. ద్రోణునికి  ,అతనికొడుకు చనిపోయాడని చిన్న అబద్ధం చెప్పావు కాబట్టి నరకం చూశావునీవు.మాంధాత,భగీరథ, శకుంతల కొడుకు భరతుడు ఉన్న  లోకాలలోనే దివ్యసుఖాల్ని అనుభవిస్తావు.అదిగో మందాకినీనది! అందులో మునిగితే అన్ని దోషాలు పోతాయి."
ధర్మదేవత ఇలా అన్నాడు "ద్వైతవనంలో అరణిని అపహరించి యక్షరూపంలో నిన్ను ఎన్నో ప్రశ్నలడిగాను.కుక్క రూపంలో నీవెంట వచ్చాను. ఇప్పుడు కూడా నేను పెట్టిన పరీక్ష లో నెగ్గావు. తమ్ముళ్లతో సహానీవు  స్వర్గంలోనే ఉంటావు.నీవు చూసినదంతా  ఇంద్రుడు కల్పించిన మాయ!గంగాదేవిని దర్శించు" 🌹
కామెంట్‌లు