అట్లతద్ది నానీలు! : - పాలగుమ్మి జ్యోతి.



అలసిపోయాయి రోళ్ళు 
రుబ్బుతూ...
గోరింటాకు, గోంగూర 
అట్లతద్దికి!!

పంట కోసం
ఎదురుచూస్తున్న భామ!
గోరింట పెట్టిన
చేయి కడుగుతూ...!!

ప్రతి ఇంట్లో
పెనాలు పాడుతున్నాయి!
ముక్తకంఠంతో...
సుయ్యి సుయ్యి రాగాలు!!

ముచ్చట పడుతూ
మోస్తున్నాయి!
ఉయ్యాల బరువును
తరువులు!!

ముస్తాబవుతున్నాడు 
అందంగా చంద్రుడు!
భామలంతా 
వేచి చూస్తున్నారని!!
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Beautiful portrait and nanis👏👏👏