సామెత -390: ఈవల గట్టున ఉండే ఆవుకు ఆవలి గట్టు పచ్చన అన్నట్టు
****
"అవ్వా! మనది గిదేం బతుకవ్వా! బత్కుడంటే గా గోదారవ్వ లెక్క బత్కాలె.ఎప్పుడు సూశినా నిండు గోదారి లెక్క కళకళ్ళాడుతుంది. కట్టిన శీర కట్టదు.పెట్టిన సొమ్ములు పెట్టదు.అబ్బో వైభోగం సూత్తుంటే నీయవ్వ మనవూఁ వున్నామెందుకు పొద్దుగాల లేత్తె శాకిరే శాకిరి ఓ ఇత్తిరి గుడ్డలు ఏస్కునుడు లేదు.సక్కంగ గా అవ్వ లెక్క తయారవుడుండదు. అయినా అవ్వా ! దేనికైనా నోశిపుట్టాలె. బూమ్మీద పుట్టినప్పుడే గిసుమంటి తల్రాత రాసుకోనొచ్చినం.ఇంగేం మార్తయి."
"ఏంది శెల్లె! ఎన్నల్లేంది గియ్యాల గట్ల రంది వడ్తున్నవ్?"
"ఆ ఏవుందవ్వా సచ్చే దన్క గిదే పెండ పిసుక్కొనుడు.పొలాలు శేలని అడవుల పొంటి పోవుడు.దినాం గా శేనెట్లుంది.గీ శెల్కెట్లుంది?గా బర్రె సూడిది దాన్కి మంచి తిండి బెట్టాలె.గీ బర్రె పాలిత్తుంది.పచ్చిగడ్డి తెచ్చెయ్యాలె.గిద్దప్ప మన తాన ఏవన్న కొత్త ముచ్చెటి వుంటదా?మనల్ని మనం అద్దంల సూస్కోని ముర్సుడన్న వుందా శెప్పు?"
దినాం జేసే పన్లే గద శెల్లే? ఏందో కొత్త శెప్తున్నవ్?"
"అవునవ్వా! గానిగెద్దు లెక్క శేసుడే శేసుడు.అర్వ శాకిరి.నెత్తిన యిత్తులు పడ్డకానించి గిదే శాకిరి. సుక్క బొడవంగ లేత్తమా శీర కుచ్చిళ్ళు బొడ్లె దోపి, కొంగు నడ్ముకు సుట్టి,తల్కాయ గోర్లకొట్టుకొని గంత బారున్న నెత్తిని ఏలి శిగేసి ముడ్సుకుని ఆకిలి, సానిపి, ముగ్గు మొదల్కొని పతొక్క పనిల మనవేఁ నాయె."
"అవును గని శెల్లే! గితంత కొత్త గాదు గద.నిత్తెమున్నదేనాయె?"
"అవునవ్వా! ఆ యెందుకుండదు నిత్తెముంటది. సచ్చే దన్క ఉండనే వుంటది.గందుల బడి కొట్కుంటున్నం గని గోదారవ్వని సూశినంక మనం గట్లెందుకు ఉండట్లే? అన్పిచ్చింది.నీకు సుత అన్పిచ్చే వుంటది? ఎహే మనం సుత మన పొలాలు శెల్కలు అమ్ముకొని పట్నం బొయ్యి ఏదోక యాపారం శేస్కుంట గా అవ్వ లెక్క ఎందుకుండొద్దు శెప్పవ్వా?"
"ఏంది శెల్లే! ఊఁ అంటే ఆఁ అంటే గా గోదారవ్వ జపం శేత్తున్నవ్!గామె మనకంటే ఏం బావుంది? ఏం సుకంగుంది శెప్పు?"
"గదేందవ్వా! గా మొన్నొచ్చి నాల్గు దినాలు ఉండిపోయిన గోదారవ్వని సూశి ఊరు ఊరంత గామంత అదృట్టవంతురాలు లేదు. మనవూఁ వున్నమెందుకు అని ఊల్లె అమ్మలక్కలు అన్కుంటుంటే నువ్వేంది గిట్లనవడ్తివి?"
"ఆఁ శెల్లే!"దూరపు కొండలు నునుపుల్లావు" అన్నట్టుంది నీ ముచ్చెటి. మొన్న వొచ్చినప్పుడు ఇంటికొచ్చి శానా ముచ్చెట్లు శెప్పింది. గా పట్నం ఏవుంది? వొద్దంటే యాపారం శేస్కుంట బత్కుదాం అని తోల్కబోయిండు. గీ పోటీ పెపంచకంల బత్కుడు ఎంత కట్టం."
"మేం బెట్టిన కొత్తల్ల మా దుక్నం ఒక్కటే నాల్గు పైసలు శేతులాడేవి.పట్నం బెరిగి పక్క పక్కనే దుకణాలు పుట్టకొక్కులొతికె పుట్టుకొచ్చి ఆమ్దాని మీద గండి కొట్టినయ్."
"ఇంగ ఉన్న బంగారం కుదువ బెట్టుడు పొల్ల గాండ్ల సద్వుకు కర్సు వెట్టుడు.గట్ల గయ్యి యిడిపిద్ద మన్కునే సయిమానికి ఇంకో కర్సు వొచ్చి పడుడు "అంది."
"అయితేందవ్వా! నల్గని శీర, పెయ్యి మీద దగదగ సొమ్ములతో మెరుత్తనే వుండే."
" ఓ శెల్లే! సుట్టపోల్ల ముందు నాదానైతదని గిల్టు సొమ్ములు ఏస్కోని తిర్గుతుందట."
"అయిన గని శెల్లే. నువ్వేమన్కోనంటే మడిషి బుద్ధి ఎట్లుంటదో శెప్పన. ఇగ్గో గీ శాత్రం లెక్కనే" ఈవల గట్టున ఉండే ఆవుకు అవుతలి గట్టు పచ్చన అన్నట్టు " వుంటది."
"గీ శాత్రం! నువ్వే పుట్టించినవా ఏంది? గా ఆవు లెక్కనేనా నేను సుత...?"
"గట్లన్నన్కో. గీ యవ్వేంది.గిట్లనవట్టింది అంటవు.అన్కుంటవు గని గీ దునియాల నీలెక్క శానమందిరే ఉన్నరు శెల్లే!"
"నీ లెక్కనే ఓ ఆవు ఏటికి ఈవల గట్టున నిలబడి అవుతలి గట్టు సూశిందట. అబ్బ గక్కడ ఎటు సూశినా పచ్చగుంది. మంచిగ గా పచ్చ పచ్చని గడ్డి తినేతందుకు ఎట్లయిన పోవాలె అన్కుందట."
"ఇంగేముంది ఓ దినం శిన్నగ ఈదుకుంట అవుతలి గట్టు మీదకి వొయ్యింది.తీరా గాడికి వొయ్యి సూత్తే ఏవుంది? ఇవుతలెట్లుందో గాడ సుత అట్లనే వుంది. తనొచ్చినైపు తల్కాయ తిప్పి సూత్తే గాడ పచ్చగ ఎండకి మిల మిల లాడ్తుంటే అమ్మనీ ఎంత పనైంది గింత కట్టపడొచ్చిన ఏం పాయిదా లేకపాయె అన్కుందట.గట్లుంటది శెల్లే!"
"అంతే నంటవా అవ్వా! ఏందో గా గోదారవ్వ మైకంలబడి గిట్ల యిశారిచ్చిన. నిజవేఁ అవ్వా ! కలో గంజో తాక్కుంట పెశాంతంగ బత్కుతున్నం. గిట్ల కట్టం సుకం పంచుకుంట మంచిగున్నం."
"అగ్గో గదెప్పుడూ యాది మర్వకు శెల్లే!"
"గదండీ సంగతి! "ఈవల గట్టున ఉండే ఆవుకు ఆవలి గట్టు పచ్చన అన్నట్టు" అంటే గిదే మరి."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి