కళలే సంస్కృతి సంప్రదాయ వారదులు : - ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్-(పుష్యమి)-సెయింట్ లూయిస్- అమెరికా

 

భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక మన భరతావని.
కళలకు కాణాచి మన సంస్కృతి సంప్రదాయాలు
.
అరవై సంవత్సరాల క్రితం 
బాల్యంలో 
శరన్నవ రాత్రుల వినాయక నవరాత్రులలో
బుర్రకథ హరికథలు 
గ్రామ దేవతల ఉత్సవాలలో జరిగే  సురభి నాటకప్రదర్శనలు
తోలు బొమ్మలాటలు
ఒగ్గు కథలు, బుడ బుక్కల వారి ఢమరుక ధ్వనులు 
సంక్రాంతి సందర్భంగా హరిదాసు కీర్తనలు 
పులి వేషాలు పోతురాజు  విన్యాసాలు 
ఎన్నని ఏమని చెప్పను  
జానపద కళలు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలు .
ఆప్యాయతలు ఆనందాలకు  నిలయాలు.
 
నేడు చరవాణితో
పసిపిల్లల నుంచి 
పండు ముదుసలి వరకు కాలక్షేపం 
పాశ్చాత్య పోకడలతో తీర్థాలలో జాతరలలో జరిగే 
అసభ్యకర నృత్యాలు 
ప్రజలను ప్రధానంగా పెడద్రోవ పట్టించే  మార్గాలు 
సంస్కృతి సాంప్రదాయాలకు  నిలయాలైన 
కళలు కాలగర్భంలో కలసిపోకుండా పరిరక్షించుకోవడం ప్రభుత్వ మరియు 
ప్రజల బాధ్యత ...!!

కామెంట్‌లు