భౌతిక శారీరక రుగ్మతలు రోగాలు దేహంకి తప్పవు.రమణమహర్షి ఇలా అన్నారు" వీడి (దేహం) గతి బాధ వాడు అనుభవించితీరాలి.రామకృష్ణపరమహంస కూడా దైహికబాధ అనుభవించారు.నేడు వాతావరణం,తిండి వల్ల రోగాలతో మూలగకతప్పదు. అలా అని కూచోకుండా పుస్తకం,రేడియోతో కాలక్షేపం చేయాలి.మనసే మనకు మనశ్శాంతికి మూలాధారం! దసరా రోజులు రోగాలతో సతమతమయ్యే కాలం కాబట్టే అమ్మవారి పూజలు,హోమాలతో మనసు చిత్తం దైవంపై భరోసాతో హాయిగా ఉంటుంది.అలాగే బతుకమ్మ ఆటపాటల సందడితో చీకూచింత కాసేపైనా దూర మవుతాయి. ఎపిక్టెటస్ అనే వేదాంతి దాదాపు 2వేల ఏళ్ల క్రితం ఇలా అన్నాడు" మనశరీరంపై ఉన్న వ్రణాలు,కురుపులు బాధకన్నా ఆలోచనకన్నా మనసులోని దురాలోచనలు తొలగించాలి. కష్టం వల్ల కాక దాన్ని గూర్చి విపరీతంగా ఆలోచిస్తే గాయం బాధ ఎక్కువ అవుతాయి.మనం క్రమపద్ధతిలో పనులు చేస్తూపోతే, మనోభావాలు కూడా క్రమపద్ధతిలోనే ఉంటాయి.శరీరం మనస్సు సదా మంచి పనుల్లో మునిగితే చాలు.
కార్నెగీ ఇలా రాశాడు" ఓవితంతువుకి ఏలోటు లేదు.కానీ తన ముగ్గురు అల్లుళ్లు స్వార్థపరులని, లోభులని నిందిస్తూ వారి ఇళ్లలోనే ఉంటుంది.తన డబ్బుని దాచుకుంటూ, కూతుళ్లు తనను దోచుకుంటున్నారని అందరితో చెప్పేది.
హెచ్.ఎల్.ఎగ్నెట్ అనే వ్యక్తి రకరకాల జబ్బులతో నీరసించాడు.ఇక అతను చనిపోతాడని అంతా శోకసంద్రంలో మునిగారు.ఎగ్నెట్ పైకి సరదాగా నవ్వటంతో, కుటుంబం ఊపిరిపీల్చుకుంది. ఆరోగ్యానికై డాక్టర్ల సలహాలు పాటిస్తూ,జాగ్రత్తగా ఉండాలి.వేరే వ్యాపకాలు, కాలక్షేపంతో రోగి తనను తాను మర్చిపోయి,బంధువులను ఖంగారు పెట్టకుండా మసలుకోవాలి. అందుకే దైవధ్యానం,పుస్తకపఠనంతో గడపాలి.మితంగా మాట్లాడుతూ,మనకి నచ్చిన పని చేయాలి.ఇదే తపస్సు అన్నారు ఋషులు.నేడు యోగా మెడిటేషన్ అంటూ మనసుని మలుపు తిప్పాలి. మన బాధ అనుభవిస్తూనే, ఇతరులను ఖంగారు పెట్టరాదు🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి