సామెత-385: ఈ ఇంటి మీది కాకి ఆ యింటి మీద వాలదు"అంటే
****
"అవ్వా! మరీ గంత అతకాపతకం మంచిది గాదని మన పెద్దోళ్ళు శెప్పిర్రు గద"
"అవును శెల్లే! అతెక్కువైతే నట్టమే. సూత్తన్నం గద గీ నడ్మల పొల్లగాండ్లని.ఎంత అతి శేత్తుర్రంటే గీల్లంత జాన్ జిగిరి దోత్తుగాళ్ళు అయినట్టు ఒకల్నొకలు యిడ్వకుంట సోపతి శేసుడు.తేడా వొత్తే నరుక్కునే,పొడ్సుకునే అంత కయ్యానికి కాలు దువ్వుడు సూత్తున్నం."
"అవునవ్వా !గా సింగయ్య మావఁ, గోపయ్య మావఁల మాట ఒక్క కుతికె లెక్క ఉండేది.శేతలు సుత నాల్గు శేతులైనా ఒక్క పిడ్కిలి లెక్క ఉండేయి. గాళ్ళు బుజాల మీద శేతులేస్కోని దంటగ ఎల్తుంటే గీళ్ళిద్దరు అముడాలోల్లా ఏంది? అన్నట్టు అగుపించేటోళ్ళు. ఇంగ తాతలు అవ్వలైతే శిన్న పోరలని కూసవెట్టి అగ్గో సోపతి శేత్తే సింగయ్య, గోపయ్యల లెక్క శెయ్యాలి మనం రామాయిణం సూల్లే యిన్నం. బారతం యిన్నం సూల్లే. బాగోతం కతలు కతలుగా శెప్తుంటే యిన్నం.గియ్యీటన్నింట్ల దోత్తానం గొప్పతనం యిన్నం గని,మన కండ్ల ముంగల్నే కనవడుతుర్రు సూడు గాల్లిద్దరు.ఆల్ల లెక్క ఉండుర్రి అనేటోళ్ళు."
"అవును శెల్లే! గంతగనం పాలు నీళ్ళొతికె కల్శిపోయినోళ్ళు గియ్యాల ఉప్పు,నిప్పోలె అయ్యిర్రు.గీళ్ళకు, గాళ్ళకూ యిద్దరికయినోళ్ళు ఆల్లిండ్లకి ఎల్లినప్పుడు సూడాలె. నోరు జారి ఒకలి పేరు ఒకలి తాన ఎత్తిర్రా.ఇంగ అయిపోయినట్టె.నిప్పు తొక్కిన కోతి లెక్క శిందులేసుడు,మిర్పకాయ కొర్కినంత కారం కారంగా కోపం జేసుడు సూశినం."
"అవునవ్వా! ఊల్లె అందరు గంత మంచిగ ఉన్నోళ్ళ నడ్మల గిసుమంటి లొల్లి ఎట్లొచ్చింది అని యిశారిత్తుర్రు. శివరాకరికి ఈల్లింటికి బొయినోళ్ళతో ఆళ్ళు,ఆళ్ళింటికి బొయినోళ్ళతో ఈళ్ళు మాట్లాడ్డం సుత బందువెట్టిర్రవ్వా!"
" అవును శెల్లే గందుకే "ఈ యింటి మీద కాకి ఆ యింటి మీద వాలదు" అన్నట్లైంది."
"బలే శాత్రం శెప్పినవ్ అవ్వా! సుట్టు పక్కనోళ్ళు మాత్తరమే ఎల్లరేమో అన్కున్నం గని, కాకులు సుత "ఈ యింటి మీద కాకి ఆ యింటి మీద ఆలక పోవుడు" శిత్రంగుంది."
"గిందుల్ల శిత్రమేం లేదు శెల్లే! గంత మొకవందాలు వాశినయని అర్తం. నీడ కాదు గద ఒకలూసు ఒకలు యినేతందుకు సుత ఓర్సుకోలేనంత దూరం వెరిగిపోయిందని అర్తం శెల్లే.నిత్తెం ఆ ఇంటి మీద ఈ ఇంటి మీద ఆలె కాకి సుత గీళ్ళ యవ్వారం సూశి బయపడిందన్న మాట."
" గట్లనా అవ్వా అర్తం అయ్యింది."
"గదండీ సంగతి! "ఈ ఇంటి మీది కాకి ఆ యింటి మీద వాలదు" అంటే గిదే మరి."

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి