మనం ప్రేమను ఆడుక్కుందాం...!
అందరూ డబ్బును ప్రేమిస్తారు
మనం ప్రేమను ప్రేమిద్దాం...........!!
డబ్బును దానం చేసే వారి కన్నా
ప్రేమను దానం చేసేవారే ఎక్కువున్నారు.
డబ్బును దానం చేసి చేసి బిచ్చగాళ్ళు అవుతారేమో
కానీ ప్రేమను దానం చేస్తే లక్షాధికారులు అవుతారు.
డబ్బుకు ఓటమి ఉంటుందేమో కానీ
ప్రేమకు ఓటమి ఉండదు.
డబ్బుకు వివక్ష ఉంటుంది కానీ
ప్రేమకు వివక్ష ఉండదు...
డబ్బుతో ప్రేమను కొనలేమేమో కానీ
ప్రేమ ఉంటే డబ్బు ఉన్నట్లే...........!
డబ్బు ప్రేమనుకొంటుంది. ప్రేమ ప్రేమను కంటుంది
డబ్బు సంతోషాన్నికొంటుంది. ప్రేమ సంతోషాన్ని కంటుంది.
===============================================
సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని యుపిఎస్ ఖానాపూర్ నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి