సుప్రభాత కవిత : - బృంద


నిదరోయే నీటి చెవిలో 
తొలికిరణపు గుసగుసలు 
చలి విరిగిన ఏటి నీటికి 
ఎదలో కలిగే కితకితలు

అది చూసిన ఒడ్డుకు 
మురిపెపు నవ్వులు 
ఉడుక్కున్న  సూరీడి 
సూది గుచ్చే చూపులు

గుండెలో దాచిన వలపంతా 
గుమ్మరించి  పరచి 
గుమ్మాన నిలిచిన విభునికి 
గలగలలే  హారతి!

తమను దాటి అవనికి
తనివితీరా హత్తుకుని 
ప్రేమను తెలిపిన మిత్రుని 
గని ఎరుపెక్కిన నింగి!

వెనుదిరిగి నిలిచి 
విస్తుపోయి చూచిన 
తిమిరాన్ని బెదిరించి 
తరిమేసిన  వెలుగు!

ఇన్ని వింతైన విషయాలు 
కన్నుల విందుగా జరిగే 
సూర్యోదయ సమయాన్ని 
తరచి చూసే ప్రతి మదికీ 

🌸🌸సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Excellent mam 👌👌