నెంబర్ దే నయా జమానా: - కొత్త విరిత
 



బరువెంత? ఎన్ని కిలోలు?
ఎత్తెంత? ఎన్ని సెంటీమీటర్లు?
బీపీ ఎంత? షుగర్ ఎంత?
ఆర్‌బీసీ ఎంత? హెచ్‌బీ ఎంత?
గుండె నిమిషానికి ఎన్ని సార్లు కొట్టుకుంటుంది?
నిద్ర ఎన్ని గంటలు? నడక ఎన్ని అడుగులు?
వ్యాయామం ఎన్ని నిమిషాలు? నీళ్లు ఎన్ని గ్లాసులు?
ఇలా ఏది చూసినా, ఎటు చూసినా…అన్నిటికీ కొలమానం "అంకెలే"!
ఇప్పుడు మనిషిని పరిచయం చేసుకోవాలన్నా
ముందుగా పేరు అడగం…
“ఎంత జీతం?” అని అడుగుతాం!ఇల్లు ఎంత పెద్దది? కారు ఎంత ఖరీదు?
ఫోన్ ఎంత ధర?బ్యాంకులో ఎంత బ్యాలెన్స్?పిల్లలకు ఎన్ని మార్కులు?
మన ఫొటోకు ఎన్ని లైకులు?
మనిషి మంచితనం కూడా ఏదో ఒక రోజు“మూడు వందల లైకులు… సగటు మంచి మనిషి!”
అని రేటింగ్‌తో వస్తుందేమో, ఎవరికి తెలుసు!చివరికి సంతోషానికీ ఒక యాప్ వచ్చి“మీ ఆనందం ఈరోజు 82 శాతం మాత్రమే,మిగిలిన 18 శాతం రేపు సంపాదించండి!”
అంటుందేమో!అంకెలు ఆరోగ్యాన్ని కొలవగలవు…ఆస్తిని లెక్కించగలవు…విజయాన్ని ప్రకటించగలవు…కానీ ప్రేమకు ఎన్ని కిలోలు?అనుబంధానికి ఎన్ని సెంటీమీటర్లు?మనసుకు ఎంత స్కోర్?అవి లెక్కపెట్టడం మొదలుపెడితే,బహుశా మనిషి దగ్గర ఉన్నదంతా అంకెలే మిగులుతాయి,మనిషి మాత్రం ఎక్కడో లెక్కల్లోనే మిగిలిపోతాడు!
సరదాగా,చివరికి మనిషి విలువకీ ఒక నెంబర్ పెడదాం…
మంచితనం  78%
ప్రేమ  64%
నమ్మకం  52%
అహంకారం  91%
అవసరానికి పనికొచ్చే పరిచయాలు 0%!
ఇక మనిషిని కలవాల్సిన అవసరమే లేదు,ప్రొఫైల్ ఓపెన్ చేస్తే చాలు!ఎన్ని ఫాలోవర్లు, ఎన్ని లైకులు, ఎంత జీతం, ఎంత స్టేటస్,మనిషి మొత్తం డేటా ప్యాక్‌లో దొరికేస్తాడు!కానీ,ఈ నెంబర్లన్నీ ఇంత బాగా పెరుగుతున్నా,మనిషితనం మాత్రం ఎందుకు తగ్గిపోతోందో!బహుశా దానికి కూడా త్వరలో ఒక యాప్ వస్తుందేమో…“మీ మనిషితనం 12%.”“అప్‌గ్రేడ్ చేయాలంటే
‘పే నౌ’ నొక్కండి!”అప్పుడు బహుశా మనిషి కూడా అర్థం చేసుకుంటాడు,
జీవితమంతా నెంబర్లను పెంచుకున్నాం…కానీ మనిషితనానికి మాత్రం ‘లో బ్యాలెన్స్’ చూపిస్తున్నామని!
కామెంట్‌లు