అందలేనిది ఏది?
ఆరోగ్యం ఉంటే
పొందలేనిది ఏది?
ఇష్టం ఉంటే పనిలో
కష్టం తోచదు మదికి!
నష్టం లేని పని
నలుగురికై చేస్తే సరి!
మాట కలిస్తే స్నేహం
మాట తూలితే కోపం!
మౌనం మంచి లక్షణం
అదే గట్టి ఆయుధం కూడా!
పద్దతి నచ్చకపోతే మౌనం
పనులు నచ్చకపోతే దూరం!
వద్దనుకుంటే కూరిమి
వద్దకు రాదు చెలిమి!
నిద్రకు లేదు సౌఖ్యం
ఆకలికి లేదు రుచి!
దాహానికి నీళ్లు అమృతం
ఆకలికి నీళ్ళే అన్నం!
చీకటిని తరిమితే వెలుగు..
వచ్చే పండుగ వేకువ
నిరాశను తరిమితే నిత్యం
ఆశ ఫలించేను తథ్యం!
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి