తాతయ్య అమ్మమ్మ .. హాలోవీన్ పండుగ : - ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ - (పుష్యమి)-సెయింట్ లూయిస్ - అమెరికా
 

 తాతయ్య అమ్మమ్మ ఈరోజు రేపు  మాకు శెలవు హాలోవీన్  అని మనుమడు  ప్రతాప్ చెప్పి సెయింట్ చార్లెస్ మెయిన్ స్ట్రీట్ కి వెళదాం మిమ్మల్ని తీసుకెళతాను అంటే 
    నా అర్ధాంగి అదేమిట్రా అనంటే అది కాదే అమ్మమ్మ  అక్టోబర్ 31 న పూర్వీకుల ఆత్మలను స్మరించుకు0టు చేసుకునే పండుగ  హాలోవిన్.
   సుమారు పదిహేను రోజుల ముందునుంచి  ఇంటి ముందు పంప్ కిన్ అదే గుమ్మడికాయ ను దొలిచి దీపం వెలిగించి  గుమ్మం ముందు ఉంచుతారు  అస్థిపంజర0 ,వివిధ  భయంకర ఆకృతుల బొమ్మలను పెడతారు 
 తాము కూడా   భూతాలు దెయ్యాల వలె  విచిత్ర వేషాలు వేసి పిల్లలు  ' ట్రిక్ ఆర్ ట్రీట్' అంటు ఇంటింటికి వెళ్ళి చాక్లెట్లు, స్వీట్లు స్వీకరిస్తారు అని చెపితే గీతాంజలి హీరో నాగార్జున సినిమాలో  'నందికొండ  వాగుల్లోన నల్లతుమ్మ నీడల్లో' పాటలో వేషాల లాగా అన్న అమ్మమ్మతో  నీ సినిమా నాలెడ్జ్ అమోఘం అలాగే అన్న  మనుమడితో పద తీసుకెళితే వస్తాం అంది  సెయింట్ చార్లెస్ స్ట్రీట్ లో వేషాలు చూసి భలే ఉన్నాయిరా ప్రదీప్ వేషాలు  అంది.మీరు వేషాలు  వేసుకోండి అంటే వేసుకోం కాని మీతో ఫోటో తీసుకుంటాం అని  హాలో విన్ సందర్భంగా ఫోటో తీసికొన్న అమ్మమ్మ తాతయ్యతో మీరు పిల్లల్లో పిల్లలు పెద్దల్లో పెద్దలు 'బి రోమన్ వెన్ యు ఆర్ ఇన్ రోమ్' అన్నదానికి ప్రతీక. అందుకే మీరంటే నాకు ఇష్టం అన్న మనుమడి కుటుంబాన్ని ఆశీర్వదించాం...!
...............................
కామెంట్‌లు