తాతయ్య అమ్మమ్మ మీరు తప్పకుండా బరోడా రండి అక్కడ మీకు ఇష్టమైన స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం చూపిస్తాను నేనే దగ్గరుండి దసరా కి విశాఖపట్నం వచ్చినప్పుడు మిమ్మల్ని తీసుకువెళ్తా అని సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న మనుమడు అంటే ఈ వయసులో కష్టం రా అన్న భర్తతో అదేమిటి డెబ్భై సంవత్సరాల వయస్సు ఒక లెక్క మావయ్య గారు తొంబది సంవత్సరాల వరకు ప్రయాణాలు చేస్తూ ఉండేవారు అని ఫోన్లో తానే స్వయంగా వస్తున్నామని ఏబది సంవత్సరాలయి కాపురం చేస్తున్న అర్ధాంగి అన్నది మనుమడు చెప్పినట్లే తాతయ్యని అమ్మమని బరోడా తీసుకెళ్లాడు.
వెళ్లిన రెండు రోజులకే తాను కొన్న కారులో ఇద్దరినీ దగ్గరుండి గుజరాత్ లో ఏక్తా నగర్లో నర్మదా నది ఒడ్డున ఉన్న సాధు బేట్ ద్వీపంపై ఉన్న నూట ఎనుబది రెండ్ల మీటర్ల ఎత్తు గల సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం దగ్గరికి తీసుకువెళ్లి చూపించాడు
నలుబది సంవత్సరాలు చరిత్ర అధ్యాపకునిగా బోధించిన తాతయ్య స్వాతంత్ర్యం లో పటేల్ నిర్వహించిన పాత్ర తరువాత గృహ మంత్రిగా రాజుల సంస్థానాలను దేశంలో విలీనం చేయడం ప్రధానంగా మన నిజాం ప్రభుత్వ హైదరాబాద్ ను భారతదేశంలో విలీనం చేయడం ఎన్నో విషయాలను చెప్పి ఒరేయ్ ప్రతాప్ మా జన్మ ధన్యమైందిరా. ఆ రోజుల్లో ప్రజా ప్రతినిధులు నిస్వార్ధంగా ఉండి ప్రజాహితమే ధ్యేయంగా పని చేసారు
ఉప ప్రధానిగా కూడా పటేల్ చక్కగా కర్తవ్యం నిర్వహణ చేశాడు ఒరేయ్ ఈ గ్యాలరీ కూడా ఆనాటి స్వాతంత్ర్య సంగ్రామ చిత్రాలతో చాలా బాగుందిరా ప్రభుత్వం ఒక పైసా కూడా ఖర్చు పెట్టకుండా అంతా ప్రజల ఆర్థిక సహాయంచే నిర్మించబడిన ప్రపంచంలోనే ఎత్తయిన విగ్రహం ఎంత బాగుందో నిజంగా పటేల్ గారికి ప్రజల సహకారంతో ప్రభుత్వం ఇచ్చిన నిజమైన నివాళి . ప్రతాప్ నీకు తెలుసా ఈమధ్యనే శ్రీరాముని దరి చేరిన ప్రముఖ శిల్పి రామ్ వి సుతార్ ఎంత బాగా డిజైన్ చేశాడు ఈ ఐక్యత విగ్రహం (స్టాట్యూ ఆఫ్ యూనిటీ) అని నామకరణం కూడా బాగుంది. నీ దయవల్ల ఆ మహనీయుని విగ్రహాన్ని వారి జయంతి నాడే అక్టోబర్ 31న చూడడం మేము చేసుకున్న అదృష్టం. నీవు అమెరికా వెళ్ళే లోపు చూడాలనుకున్న స్టాట్యూ థాంక్యూ ఆఫ్ యూనిటీ చూడటం చాలా బాగుంది నా కల సాకారమైంది అన్న తాతయ్యకి అమ్మమ్మకి పటేల్ విగ్రహం ముందే
కుటుంబంతో సహా ఫోటో తీసి చూపించి
మనవడు ప్రతాప్ ,భార్య పిల్లలు నమస్కరిస్తే ఆశీర్వదించారు దంపతులు..!
.............................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి