రణభాలి సినిమా కథ స్పూర్తి తో "ఆహారం - నీరు వృథా చేయకు": - -కలమట శ్రీనివాస్ రావు -విశాఖపట్నం

 

అయ్యో రామా అయ్యో రామా 
మనసేలేని మనుషుల పాలనలో
కార్చిచ్చులా గుడెసలన్నీ కాలుతుండే 
కాలం గడిచి
గతాన్ని మరిచే
ఆకలి దప్పులతో 
కట్టు బట్ట లేక 
పక్క పాన్పులు దిక్కులేక 
నిలువ నీడ లేక 
చెట్టు నీడన సేదతీరెను 
కళ్లెదుటే తోడువారు 
ప్రాణాలే గాలి కలిసే 
కట్టేలయిన ఆగకుండే 
కంట కన్నీరుగా రగతమెమో కారుతుండే 
మునుపు కాలం చూడలేకే కాలగమనంలో మరిచిపోయే

మట్టిన పుట్టిన మనిషివి
మట్టిన కలిసే వరకే
నువ్వుపడే తపనలన్నీ
నీవు చేసే కర్మలన్నీ 
నీవు కన్న కలలన్నీ ఆకలి దప్పుల తీర్చుటకే కదా
మరువకు మరువకు యాద మరువకు
కూడు,గుడ్డ,నీరు
విలువ తెలియక 
యాద మారిచి
నిర్లక్ష్యం చేస్తే 
కటిక దరిద్రామైన
కన్నీటి గతాన్ని 
మతికితేకు 
గతాన్ని మరలా 
చూడ తరమా
మరలా కాలగమనం మార్చగలమా
అది మరలా మన తరమా
కనుల రెండు చెమ్మాగిల్లి
కాళ్ళు రెండు మోకరిల్లి వేడుకుంటూ అడుగుతున్నా
మౌలికాలను యాద మరువకు 
అన్నమేమో బ్రహ్మా రూపం
గంగ కూడా దైవ రూపం
అన్నీ ఉండే కర్మ భూమిపై జననమే 
దేవుడిచ్చిన వరముగా 
విలువ తెలియక వృథా చేయకు 
మెరిసేదంతా బంగారమా
కూసేవన్నీ కోయిలేనా
చూసేవన్నీ నిజమైనవా
జీవితమేమైన శాశ్వతమా
నీ ప్రాణాన్ని రక్షించుకో
తోటి ప్రాణిని ఆదరించి
జీవకోటిని కాపాడు.

కామెంట్‌లు