భార్య గొంతు వినడం కోసం 12 ఏళ్లుగా అదే ఫోన్‌ను కొనసాగించిన భర్త!
ఇంగ్లండ్‌కు చెందిన స్టాన్ బీటన్ భార్య రూబీ 2003లో క్యాన్సర్‌తో చనిపోయారు.
ఆమె చనిపోయినా, తన గొంతుతో రికార్డ్ చేసిన ఓ చిన్న ఫోన్ సందేశం మాత్రం స్టాన్ దగ్గర ఉండేది. భార్య గుర్తొచ్చినప్పుడల్లా ఆ సందేశం పెట్టుకుని ఆమె గొంతు వినేవారు. అలా వింటుంటే ఆమె తన పక్కనే ఉన్నట్లు అనిపించేది.
12 ఏళ్ల పాటు ఆ రికార్డింగ్‌ను జాగ్రత్తగా కాపాడుకున్నారు. కానీ 2014లో ఫోన్ కంపెనీ చేసిన సాంకేతిక మార్పుల వల్ల ఆ సందేశం చెరిగిపోయింది.
ఇక తన భార్య గొంతు వినలేనేమోనని స్టాన్ చాలా బాధపడ్డారు.
ఈ విషయం తెలుసుకున్న వర్జిన్ మీడియా సంస్థకు చెందిన 11 మంది సాంకేతిక నిపుణులు మూడు రోజుల పాటు వెతికి, చివరికి ఆ రికార్డింగ్‌ను తిరిగి పొందారు!
చాలా కాలం తర్వాత మళ్లీ భార్య గొంతు వినగానే స్టాన్ భావోద్వేగానికి లోనయ్యారు. పోయిందనుకున్న తన జీవితంలోని ఓ మధురమైన జ్ఞాపకం మళ్లీ దొరికినంత ఆనందం ఆయనకు కలిగింది.
మనకు ఇష్టమైనవారు మన మధ్య లేకపోయినా, వారి గొంతు వినిపిస్తే చాలు... వాళ్లు మళ్లీ మన దగ్గరికి వచ్చినట్లే అనిపిస్తుందిగా!!
కొన్నిసార్లు ఓ చిన్న జ్ఞాపకమే మనసుకు ఎంతో పెద్ద ఓదార్పునిస్తుంది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి