పుష్ప రాజమా!: - డా వసుంధర చెన్నై
 

ప్రకృతిలో 
 శ్రేష్ట వస్తు జాల
మొక 
విశిష్టతను సంతరించుకొంది
అష్ట దిగ్గజాలు కల్ప వృక్షాలు 
కొండా
కోనలూ నదులు
అన్నిటా 
తమ ప్రత్యేకత చాటుకొనే  
 వస్తుజాలం మన పురాణాలలో
లభ్యం
కల్ప నృక్షాలు ఐదు
మందార పారిజాత సంతాన కల్పవృక్ష హరిచందన
 వృక్షాలు ఇవి స్వర్గలోకంలో సొగసులోలికే దేవత వృక్షాలు పంచ వృక్షాలు అని కూడా వీటి పేరు 
పారిజాతం అతి చిన్న పువ్వు తెల్లని శరీరానికి ఎర్రని ముక్కు చక్కని సువాసన 
రాత్రి తన చక్కదనంతో
విచ్చుకొని వేకువనే చెట్టు కింద
సుమనోహర పాన్పులా 
జలజల రాలే 
పారిజాత పుష్ప 
గాధ అమరం 
సత్య కోపానికి రుక్మిణి ఆనందానికి ఆనవాళ్లు పారిజాత పుష్పం
 చిన్న పువ్వు నడిపిన కథ పెద్దదే.
భూలోకంలో
మరికొన్ని 
దేవత వృక్షాలుగా పూజింపబడ్డాయి పడుతున్నాయి 
రాగి మర్రి తులసి
బిల్వ ఉసిరి
వృక్షముల పూజ ప్రజలకు అతిముఖ్యం
 ఇంతమంచి వృక్ష
సంపదగల మనమెంత అదృష్ట వంతులమో కదా
వాటిని సంరక్షించుకోవడం
మనకర్త వ్యం.
ఆ గాలి ఆ పూలు
ఆ పత్రీ మన కర్మ
విముక్తికి
ఆరోగ్య వృద్ధికి
దివ్యౌషుదాలు
కామెంట్‌లు