సుప్రభాత కవిత : - బృంద


కమ్ముకున్న కలతలన్నీ 
కరిగి కురిసి పోయాక 
కడిగిన ముత్యంలా 
కళకళలాడదా మనసు!

కటిక చీకటినే తరిమేసే 
కత్తి లాటి కిరణాలను 
కారుమబ్బుల  తెరలు 
కనిపించకుండా  ఆపేనా?

చిన్నపాటి వెలుగు రేఖ 
చింతలు తొలగించి 
చిన్నబోయిన మదికి 
చిగురుటాశలు  ఇవ్వదా!

చిత్తమున విశ్వాసము 
చిరమైన యత్నము 
చిక్కులెన్ని ఎదురయినా 
చెదరని ధైర్యం  చాలదా!

వెతలకైనా  కథలకైనా 
గడువు తీరిపోయేలా 
గతములా మారిపోయే
కట్టుబాటు కాలానిది కదా!

సాగిపోయే కాలంలో 
ఆగిపోయే వేదనలుండవు 
చీకటిని చీల్చే వెలుగు తెచ్చే 
ఉదయం ఉన్నది కదా!

🌸🌸సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు