చట్టం వ్రాతలకే పరిమితమైతే : - ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ (పుష్యమి) -సెయింట్ లూయిస్-అమెరికా


సమాజంలో నేడు అత్యున్నత ప్రజాస్వామ్యరాజ్యంగమ ని 
వసుదైకానికే ఆదర్శమని 
భారతరత్న డాక్టర్ అంబేద్కర్ వ్రాసిన 
మన భారతరాజ్యంగ ప్రాథమిక హక్కులు
ఇప్పటికీ అసలు సక్రమంగా అమలు అవుతున్నాయా

అన్యాయం అక్రమాలు చేసే వారిని 
లంచగొండి తనంతో న్యాయమూర్తులు
అమ్ముడు పోతుంటే న్యాయదేవత కళ్ళు మూసుకు 
మౌనంగా ఉండి పోతున్నదన్న నిజమని తెలిసి మౌనం వహించడం సబబా
 
పేదప్రజలు న్యాయంకోసం పోరాడాలని ప్రయత్నించి 
మధ్యలోనే భయంతో మౌనం వహించడం
నైతిక విలువలు పోయినపుడు 
ప్రజా ప్రతినిధులే ప్రజాభక్షకులై
ప్రజల బాగోగులను చూడనప్పుడు
సమాజం మౌనం వీడాలి 
'ధర్మో రక్షతి రక్షితః' అన్న సనాతన ధర్మ పరిరక్షణ కొరకు 
సమాజం మౌనంగా ఉండక గొంతెత్తి 
అవరోధాలు ఎదురైనా భయపడక 
సమష్టి గా పోరాడి చట్టానికి 
ఎవరు అతీతులు కాదని
చట్టం వ్రాతలకే పరిమితం కాదని
 చట్టం ముందు అందరు సమానులే అని చాటిన 
సమాజ కళ్యాణం జరిగి 
లోకా: సమస్థా: సుఖినోభవంతు అన్నదానికి ప్రతీక భరతావని అని చాటుదా0..!!
...............................

కామెంట్‌లు