పడవలో నలుగురికే చోటు! ఒకరిని దించాల్సి వస్తే ఎవరిని ఎంచు కుంటారు మీరు?
సముద్రం మధ్యలో భీకరమైన తుఫాను. ఎగసిపడుతున్న అలల మధ్య ఓ చిన్న ప్రాణరక్షక పడవ కొట్టుమిట్టాడుతోంది. అందులో ఐదుగురు ఉన్నారు. కానీ, ఆ పడవలో నలుగురు మాత్రమే సురక్షితంగా ఉండగలరు!
వైద్యుడు – ప్రాణాలను కాపాడేవాడు.
సైనికుడు – దేశాన్ని రక్షించేవాడు.
పోలీసు అధికారి – ప్రజలకు రక్షణ కల్పిస్తూ, శాంతిభద్రతలను కాపాడేవాడు.
ఉపాధ్యాయురాలు – భావి తరాలకు బంగారు బాట చూపించే ఆమె.
విలేఖరి – ప్రజలకు నిజమైన సమాచారాన్ని అందించేవాడు.
ఇప్పుడు ఈ ఐదుగురిలో ఒకరిని పడవ నుంచి దించాల్సిన పరిస్థితి వస్తే, మీరు ఎవరిని ఎంచుకుంటారు?
ఎవరి ప్రాణమూ మరొకరి ప్రాణం కంటే తక్కువ కాదు. సమాజానికి ప్రతి ఒక్కరి సేవా అవసరమే. కాకపోతే, వారి పనులు వేర్వేరు!
ఈ ప్రశ్నకు మీరు చెప్పే సమాధానం, మీ దృష్టిలో ఎవరికి ఎక్కువ ప్రాధాన్యం ఉందో మాత్రమే కాదు, క్లిష్టమైన పరి స్థితుల్లో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో కూడా ఆలోచింప జేస్తుంది.
మరి మీ నిర్ణయం ఏమిటి? ఎవరిని ఎంచుకుంటారు? ఎందుకు?

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి