చుట్టూ మనుషులున్నారు
లెక్కకు మిక్కిలి ఉన్నారు
అయినవాళ్ళు ఉన్నారు
కానివాళ్ళు కూడా ఉన్నారు
కానీ ఆత్మీయులే కరువయ్యారు
ఆప్తబంధువులే లేకున్నారు
కష్టాల్లో తోడు నిలిచే వారు
కన్నీటిని తుడిచేవారు
ఆపదలో అదుకునేవారు
నేనున్నా నీకు అని పలికేవారు
భరోసాను అందించేవారు
మాటల్లో మాత్రం కోకొల్లలు
చేతల్లో మాత్రం శూన్యహస్తాలు
ఉన్నారా అంటే ఉన్నారు
స్వార్థం ఎరుగని మనుషులు
స్పందించే హృదయలున్నవారు
పరుల బాధను తమదిగా భావించి
పరిష్కారం చూపేవారున్నారు
ప్రతిఫలం ఆశించకుండానే
ప్రేమను పంచే వారున్నారు
మానవత్వం మాయమవలేదు
మంచితనం ఇంకా మరణించలేదు
స్వార్థపు చీకటి మధ్యలోనూ
సహృదయత వెలుగులున్నాయి
మనిషికి మనిషి తోడైతే
ఒంటరి హృదయం వికసిస్తుంది
బంధాలకు అర్థం చేకూరుతుంది
ఉన్నారా అంటే ఉన్నారు
మనసులో ఇంకా మనిషితనం ఉన్నవారు!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి