రావణ వధ ధర్మవిజయానికి కట్టిన పట్టం
చెడుపై మంచి గెలుస్తుందనడానికి ఇవే నిదర్శనం
దసరా వేడుకల్లో అంబరాన్ని తాకును సంబరం
నవరూపాల దుర్గామాత పూజలతో
కోవెలలలో వెల్లివిరిసే భక్తి భావం
పూల బతుకమ్మను పేర్చి చేసే
నారీమణుల ప్రకృతి ఆరాధనం
చిన్నా పెద్దా పేదా గొప్పా భేదం లేకుండా
ఆటపాటలలో వెల్లివిరిసే ఐకమత్యం
శాంతి సౌఖ్యాలతో జీవితం సాగాలనే
జనులందరి మనసులోని అభీష్టం
పండుగనాడు కొత్త పనులకు శుభశ్రీకారం
ఆయుధపూజతో శ్రమైక జీవనానికి గౌరవం
పాలపిట్ట దర్శనం, జమ్మి పూజ శుభసూచకం
జమ్మి బంగారం ఆత్మీయులకు పంచే సదాచారం
పండుగ అంటే కేవలం ఒక వేడుక కాదు
సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ
ఆచార వ్యవహారాల వారసత్వాన్ని అందించడం
మనలోని చెడుని ఓడించి మంచిని గెలిపించడం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి