తీరొక్క పూలతో తీర్చిన బతుకమ్మా: - బి.ఉషారాణి- Govt టీచర్-మంచిర్యాల


గగనపు తారలన్ని
నేలపైన ముచ్చటగా వాలి 
రంగురంగుల విరులై
కొమ్మలు రెమ్మలు లేని 
బతుకమ్మ తరువుకు
అందంగా విరబూసాయా

కుసుమపు హరివిల్లులై
అతివల చేతులలో ఒదిగి
ఆటపాటల్లో మురిసాయా
దీపపు దివ్వెల కాంతులతో
తటాకాల నీటిపైన
పూల నావలై విహరించాయా

తంగేడు బంతి పూల 
మిసమిసల పసిడి వర్ణం
గునుగు పూలు చేమంతుల 
స్వచ్ఛమైన ధవళ వర్ణం
గులాబీలు, మందారాల
కెంజాయ వర్ణాల మేళవింపు

తీరొక్క పూలతో తీర్చిన బతుకమ్మా 
మా ఇంట ఆనందాలను నింపమ్మా
మము సల్లంగ చూసి నీ దీవెనలీయమ్మా
కామెంట్‌లు