Wait and see (కాలం ఎవడికి గులాం కాదు) : - అంకాల సోమయ్య -దేవరుప్పుల-జనగామ-9640748497


మేమిప్పుడు
ఎవరికి ఏమి కాని అనామకులం 
కొడుకు ,కూతుళ్ళను కనిసాకి విద్యాబుద్ధులు నేర్పించి 
ఉద్యోగ శిక్షణ ఇప్పించి 
ప్రయోజకులచేసి
బిడ్డనో అయ్యచేతిలో 
కొడుకును కుటుంబ యజమానిగా చేస్తే
మా స్వార్జితమంతా తన పేర ఫోర్జరీ సంతకాలతో రాయించుకొని 
వృద్ధులైన ఈ తల్లిదండ్రులను అనాథల చేసి చోద్యం చూస్తున్నాడు

ఎంత క్రమశిక్షణతో పెంచాము బిడ్డల్ని ఇంత నిర్దయులుగా మారుతారని మేము ముందే ఊహించేటట్టైతే
మాకు పిల్లాజెల్లా ఎవరూ అవసరం లేదని ముందే తీర్మానించుకునేవాళ్ళం

అయ్యో !భగవంతుడా! 
చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు 
నాపేరు మీదున్న ఆస్తి పత్రాలు కూడా నా పేరు మీదలేవే
ఈ అవసాన దశలో ఇప్పుడు కోర్టు మెట్లెక్కాలా!
కొడుకు కూతురుతో వైరం మేం ఏం పాపం చేసామయ్యా

చుట్టూతున్న దయమాలిన సమాజం 
నీ తదనంతరం నీ యావదాస్తిని 
నీ బిడ్డలకు పంచేదే కదా!
ఎందుకింత రాద్ధాంతం అని 
ఉచిత సలహాలు ఇస్తుందే!?
 
ఏ బాధైన 
ఎవరికైనా తనదాకా వస్తేనే 
దాని నొప్పేంటో తెలిసేది?
తల్లిదండ్రులు బిడ్డలను ఎందుకుకంటారు
అవసాన దశలో ఆసరాగా ఉంటారని
బ్రతికుండగానే తల్లిదండ్రుల ఆర్థిక మూలాల్ని వ్రేళ్ళతో సహాపెకలించే
చోరాగ్రేసరులు

పనిచేతగాక 
తల్లిదండ్రుల ఆస్తి బిడ్డల హక్కు అనే పరమ స్వార్థపరులు

హక్కులను గుర్తించినోడు
బాధ్యతలను విస్మరిస్తే 
బిడ్డలు పుట్టిన దగ్గర నుండి తల్లిదండ్రులు వెచ్చించిన ప్రతీపైసాను
తిరిగి చెల్లించాల్సిందే?!

కాలం ఇప్పుడు మాదీ అని విర్రవీగే దయమాలిన బిడ్డలు
మున్ముందు తగిన మూల్యం చెల్లించకతప్పదు

తస్మాత్ జాగ్రత్త 
కాలం ఎవడికి గులాము కాదు

మీ మీ మిడిసిపాటుకు
మీ అహంభావానికి
తగిన గుణపాఠం చెప్పితీరుతుంది
Wait and see
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
True sir 👌