వాలి సుగ్రీవుల వైరకారణములను వినిన శ్రీరాముడు వాలిని వధించి నిన్ను శోక విముక్తుని చేసేదను అని సుగ్రీవుని ఉరడించుట
ఓ అన్నా! శత్రువును నీవు పరిమార్చి
కిష్కిందకు విచ్చేయుట మా అదృష్టము
ఓ మహారాజా ఒక్క సంవత్సరము పాటు
నీవు రాకపోవటముచే నేను మిగుల దుఃఖించితిని
సుగ్రీవా! నీవు చెప్పే మాటలన్ని అబద్ధాలే
నేను వచ్చు వరకు నిన్ను ద్వారము వద్దనే
కాపలాగా ఉండుమని చెప్పి వెళ్ళితిని
నీవు బిలద్వారము మూసివేసి వచ్చితివి
కోపముతో అతడు నా భార్యను రాజ్యమును
లాగేసుకొని నన్ను తరిమేసినాడు
శ్రీరాముడు సుగ్రీవుని మాటలను విని
ఓ వానరా! నీకు నేను ఉన్నాను బీతి వద్దు
వానరోత్తమా! వాలి నీ భార్యను అపహరించి
గోర పాపము చేసి పాపాత్ముడైనాడు
నేను ఆ వాలిని చంపి నిన్ను రక్షించెదను
నా సీతవలె నీ భార్య కూడా అపహరించబడెను
ఆ వాలిని తప్పకుండా హతమార్చి
నిన్ను దుఃఖం నుండి విముక్తుని గావించెదను
శ్రీరాముని మాటలు విని సుగ్రీవుడు సంతోషించి
శ్రీరామునితో ఆ వానరుడు ఇట్లనెను.
=================================
కిష్కింధకాండము నందు పదవ సర్గ సమాప్తము

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి