11 సర్గ 5: ఎడ్ల లక్ష్మి


ఓ రామా! నీవు నాకు ఉత్తమ మిత్రుడవు 
నాకు మిత్రుడుగా లభించడము నా భాగ్యము 
ఓ రఘువీరా! నా సోదరుడు దుర్మార్గుడు 
అతనిబలపరాక్రమముల గూర్చి నెరుగుదును

మిక్కిలి బుద్ధిశాలి అయిన సుగ్రీవుని మాటలను విని
శ్రీరాముడు చిన్నగా చిరునవ్వును చిందించెను 
ఆ రఘువరుడు అతనితో ఇట్లు పలికెను 
నా పరాక్రమము గూర్చి నీవు సంశయించబోకు. 

మీకు పూర్తిగా నమ్మకము కలిగించెదనని 
శ్రీరాముడు దుందుభి అస్తిపంజరమును 
తన కాలి బొటన వేలుతో లేపి పైకి విసిరి వేసెను 
అప్పుడది పది యోజనాల దూరమున పడెను 

అది చూసి సుగ్రీవుడు రామునితో ఇలా అంటాడు 
ఓ మిత్రమా! వాలి విసిరినప్పుడు 
అతని కళేబరము బరువుగా ఉండెను 
ఇప్పుడు అది ఎండిపోయి తేలికగా యుండెను 

ఓ రాజకుమారా! నాకు నమ్మకము కుదరాలంటే 
నీవు ఏడు సాలవృక్షములను భేదింపక తప్పదు 
ఇది నా తృప్తి కొరకే గాని నిన్ను పరీక్షించుటకు గాదు 
పరాక్రమవిషయమున నీవు సాటిలేని వాడవు.
==================================
కిష్కిందకాండమందు 11వ సర్గ సమాప్తము.
కామెంట్‌లు