4 వ సర్గ : - ఎడ్ల లక్ష్మి
హనుమంతుని అభ్యర్థనపై శ్రీరాముని ప్రేరణను అనుసరించి సౌమిత్రి తమ వనవాసవృత్తాంతమును  సీతాపహరణ విషయమును మారుతికి వివరించుట 




వానర శ్రేష్టుడైన హనుమంతుడు 
లక్ష్మణుని మాటలువిని సంతోషపరుడై 
ఇక సుగ్రీవుని బాధలు తీరినట్టే అనుకొని 
వాయుసుతుడు శ్రీరామునితో ఇట్లనెను

ఓ రామా! తమ్మునితో గూడి ఇటు ఎందుకొచ్చితివి 
శ్రీరాముని ప్రేరణతో లక్ష్మణుడు 
శ్రీరాముని గూర్చి మారుతితో ఇలా తెలిపెను
ఓ హనుమా శ్రీరాముని గూర్చి వినుము. 

దశరథ మహారాజు జ్యేష్ట పుత్రుడు శ్రీరాముడు
సద్గుణములచే ప్రజలలో ప్రసిద్ధి గన్నవాడు 
ఇతడు తండ్రి ఆజ్ఞానుసారము
కోసలరాజ్యమును వీడి వనములోకి వచ్చెను 

అతని వెంట అతని భార్య సీతాదేవియు 
మా అన్నతో! నేను బయలుదేరి వచ్చాను 
మేము ఆశ్రమమున లేకుండా చూచి 
ఒక రాక్షసుడు సీతాదేవిని అపహరించుకెళ్ళినాడు 

ఆమెను తీసుకపోయిన రాక్షసుడెవరో మేమెరుగము
ధనువు అను గందరువుడు సుగ్రీవుని గూర్చి ఇట్లనెను 
సీతను అపహరించిన వాని గూర్చి అతడు గ్రహించునని చెప్పి 
తాను తేజోమూర్తియై స్వర్గము చేరెను.

కామెంట్‌లు