సుగ్రీవుడు విరహశోకములో ఉన్న శ్రీరాముని ఓదార్చుట - శ్రీరాముడు అతని మాటలకు ఊరట చెంది వాలిని చంపెదను అని మాట ఇచ్చుట
సుగ్రీవుడు ఆ ప్రభువుకు నమస్కరించి
కన్నీరు గార్చుచు ఈ విధముగా వచించెను
శ్రీరామా! దయామయా! నీకు శుభమగును
"ఓ రామా! పర స్త్రీని అపహరించుకు వెళ్లిన
ఆ రాక్షసుని నివాసస్థానము గూర్చి నేనెరుగను
వానిశక్తి సామర్థ్యములెట్టివో నాకు తెలియదు
సీతాదేవిని తీసుకొని వచ్చుటకు యత్నించెదను
ఓ ప్రభూ! భక్తితో నిన్ను వేడుకొనుచున్నాను
నన్ను అనుగ్రహింపుము ధైర్యముగా యుండుము
ఓ రామా! శోకము నుండి బయటపడుము
అతని మాటలకు శ్రీరాముడు ఊరట చెందెను
" ఓ సుగ్రీవా! సీతాదేవి జాడను గూర్చియు
క్రూరుడైన రావణుని గూర్చి తెలుసుకొనుము
నేను నీ గూర్చి ఏమి చేయాలో తెలుపుము
నా వలన ఆ కార్యము సఫలమగును.
శ్రీరాముడు సుగ్రీవుడు ఏకాంతముగా సంభాషించుకొని
తమ తమ కష్టసుఖాలను తెలుపుకొనిరి
సుగ్రీవుడు శ్రీరాముని మాటలను వినిన పిదప
వాలివధ పూర్తయినట్లుగా తన మనస్సున తలంచెను.
===========================================
కిష్కింధా కాండమునందు 7వ సర్గ సమాప్తము.🙏🏻

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి