శంకర్ తన అక్క కూతురు మోక్ష ఇంజినీరింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వస్తున్నట్లు తెలిసింది. మేనకోడలుకు కలిసి సరదాగ గడిపి రావాలని అక్క వాళ్ళ ఇంటికి వెళ్దామని బయలుదేరాడు. మోక్ష ట్రైన్లో వస్తుంది. శంకర్ మేనకోడలు ను ఇంటికి తీసుకునిరావాలని అనుకుని రైల్వేస్టేషన్ కి వెళ్లి వేచి చూస్తున్నాడు. మోక్ష కు ఫోన్ చేసి మాట్లాడి ఎక్కడ ట్రైన్ ఉందో తెలుసుకుని ఆ ట్రైన్ వచ్చే ప్లాటుఫారంకు చేరుకున్నాడు, ట్రైన్ వచ్చేసరికి సిద్ధంగా ఉండాలని ఆతృతగా చూస్తున్నాడు కొంత సమయం తర్వాత ట్రైన్ కనిపించింది. తన భోగి ఎక్కడ ఉందో తెలుసుకుని వచ్చేసరికి సిద్ధంగా ద్వారం దగ్గరకు వెళ్ళి దిగుతున్న వారిలో ఎక్కడ మోక్ష ఉందో చూసి చేయి పైకెత్తి పిలిచి తను ద్వారం దగ్గరకు వచ్చినపుడు బ్యాగు తీసుకుని బయటకు వచ్చారు. రైల్వే స్టేషన్ నుంచి ఆటోలో బయలుదేరి ప్రయాణంలో ఎలా ఉందో మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకున్నారు.
ఇంటి దగ్గర మోక్ష చెల్లి పూర్ణ అక్కను చూసి వెంటనే దగ్గరకు వెళ్ళి చాలా రోజులు తర్వాత కలవటం వలన ఎంతో ఆత్మీయముగా పలుకరించి బ్యాగు తీసుకుని ఇంటికి తీసుకుని వెళ్ళింది. ఇంటి లోపలికి వెళ్తూ శంకర్ .....మా అక్క ఎక్కడ ఉందా అని అనుకుంటూ ... అక్కా అని పిలుస్తూ లోపలికి వెళ్ళేసరికి .... శంకర్ వాళ్ళ అక్క వంట గదిలోనుండి ఇక్కడే ఉన్నాను తమ్ముడు అంటూ లోపలి నుంచి బయటకు వచ్చి భోజనము సిద్ధం చేస్తున్నాను అని చెప్పడంతో ... శంకర్ వంట గదిలోకి వెళ్ళి చూస్తే అబ్బో వంటగదిలో ఘుమఘుమలు మామూలుగా లేదు. కూతురుకి ఇష్టమైన రకరకాల వంటలు చేస్తున్నట్టు ఉన్నావు అక్క అని అన్నాడు. పరీక్షలు పూర్తి చేసుకుని ఇంటికి చాల రోజుల తర్వాత వస్తుంది కదా అని అంటూ బావగారు ఉదయం ఆఫీసుకు వెళ్ళారు కొంతసేపటికి ఆయన కూడా వస్తారు అని చెప్పింది. మోక్ష బ్యాగు సర్దుకుని తను తెచ్చిన స్వీట్స్ మామకు తినమని ఇచ్చింది. అందరూ కలిసి కూర్చొని మేనకోడలు తెచ్చిన స్వీట్స్ తింటూ
చాలా కబుర్లు చెప్పుకున్నారు.
మాటల్లో శంకర్ మేనకోడళ్లకు మీరు బాగా చదుకుని , మంచి ఉద్యోగం సంపాదించి, మంచి అబ్బాయి చూసుకుని వివాహం చేసుకుని ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను అని అన్నాడు. ఆ సందర్భంలో అనుకోకుండా పెద్ద మేనకోడలు పెళ్ళి చేసుకోకూడదు అని అన్నది. శంకర్ మోక్షను ఎందుకు అలా అంటున్నావు అని కారణం చెప్పగలవా అని అడిగారు. శంకర్ తన మనస్సులో.. చదువుకుని, స్వతంత్రంగా ఎదగాలనుకునే అమ్మాయిలకు పెళ్లి వల్ల తమ కెరీర్ లేదా స్వేచ్ఛ దెబ్బతింటుందేమోననే భయం ఉంటుదని,
చుట్టుపక్కల వారి జీవితాల్లో లేదా సోషల్ మీడియాలో చూసే సమస్యలను బట్టి తనలో ఇలాంటి అపోహలు కలగడం సహజమే అని అర్ధం చేసుకుని
మోక్ష ఇప్పుడే ఇంజినీరింగ్ పూర్తి చేసుకుని వచ్చింది కదా. ముందుగా ఆమె తన కెరీర్, ఉద్యోగంపై దృష్టి పెట్టేలా ప్రోత్సహించాలి అని అనుకున్నాడు. అక్క వైపు చూస్తూ
పెళ్లి వద్దు అనగానే కంగారుపడి బలవంతం చేయకుండా, ఆమెకు నచ్చిన రంగంలో స్థిరపడేందుకు సమయం ఇవ్వాలి. ఆర్థికంగా, మానసికంగా స్వతంత్రత వచ్చినప్పుడు ఆలోచనలు మారే అవకాశం ఉంటుంది అని అక్కకు చెప్పాడు.
అదే సమయంలో
కొందరి జీవితాల్లో సమస్యలు ఉన్నంత మాత్రాన అందరి జీవితాలు అలాగే ఉంటాయనుకోవడం సరికాదు అని మోక్షకు చెబుతూ
పెళ్లి అనేది ఒక బాధ్యత మాత్రమే కాదు, జీవితాంతం తోడుండే ఒక మంచి స్నేహం. నీ ఆలోచనలను, కెరీర్‌ను గౌరవించే వ్యక్తి భాగస్వామిగా దొరికితే పెళ్లి తర్వాత కూడా జీవితం ఎంతో ఆనందంగా ఉంటుందని ఆమెకు మెల్లగా అర్థమయ్యేలా చెప్పాడు.
మోక్ష ఆలోచనలను తప్పుబట్టకుండా, ఆమెకు జీవితం పట్ల ఒక సానుకూల దృక్పథాన్ని కలిగించడానికి ప్రయత్నించాడు.కానీ ఏదో తెలియని ఆందోళన మోక్ష కు కలిగి ఉండటం గమనించి....
పెళ్లి పట్ల మోక్షకున్న భయాన్ని పోగొట్టడానికి ఒక కథ చెప్పాలని అనుకున్నాడు. శంకర్ తన మేనకోడళ్ళుకు ఒక విషయం చెప్పాలి మీకు అని అంటూ పిలిచి ... మీ ఇంటి ముందు ఉన్న రోడ్డు పక్కన ఉన్న చెట్టు మీద దెయ్యం ఉంది. ఆ చెట్టు కింద నుంచి వెళ్ళిన వారికి ఆ వ్యక్తిని , వారి మనస్తత్వానిబట్టి ఆ దెయ్యం వారితో ప్రవర్తిస్తుంది. ఎవరైనా చెట్టు కింద నుంచి వెళ్ళినపుడు రాళ్లతో కొట్టడం, వింత వింత శబ్దాలు చేసి భయపెట్టడం, వింత ఆకారాలు గా కనిపించడం చేస్తుంది. నేను ఆ చెట్టు కింద నుంచి వెళ్ళినపుడు అక్కడ కొంత మంది నవ్వుతూ మాట్లాడి వెళ్ళారు, మరికొందరు బాధ పడి వెళ్తున్నారు. అని చెప్పగానే మోక్ష, పూర్ణ ఇద్దరూ దెయ్యం గురించి తెలుసు కోవటానికి ఆతృతగా అడిగారు. అపుడు వాళ్ళు మామ మీరు బయటపడ్డారా అని అడిగారు అవును అని అంటూ ..అయితే మీరు ఇక నుండి ఆ చెట్టు కింద నుంచి వెళ్ళరా ... బయపడి ఇక నుంచి ఎక్కడకు వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటారా అని అడిగితే... మేనకోడలు ఏంటి మామ అలా అంటావు బయపడి ఇక ఇంట్లోనే ఉండలేము కదా బయటికి జాగ్రత్తగా వెళ్ళాలి కదా అని అన్నారు.అప్పుడు శంకర్
నవ్వుతూ ...
ఆ చెట్టు కింద నుంచి వెళ్లేవారి మనస్తత్వాన్ని బట్టే ఆ దెయ్యం ప్రవర్తిస్తుందని
అన్నాను కదా
అంటే, మనం ఏ ఆలోచనలతో బంధంలోకి అడుగుపెడతామో, ఆ బంధం మనకు అలాగే కనిపిస్తుంది. మనం ముందే "పెళ్లి అంటే సమస్యలు" అనే ప్రతికూల ఆలోచనతో ఉంటే, మనకు అందులో సమస్యలే కనిపిస్తాయి. అదే సానుకూల దృక్పథంతో ఉంటే, ఆ బంధాన్ని అందంగా మార్చుకోవచ్చు అని చెప్పాడు.
అలాగే పెళ్ళి చేసుకుని బాధ పడతామని , పెళ్లి మానకుండా మంచి సంబంధం చూసుకుని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండాలని అనుకుని ఆవిధంగా ప్రయత్నం చేయాలి అని శంకర్ చెప్పాడు.
అప్పుడు మోక్ష... మామ చెప్పిన దెయ్యం కథ, దాని వెనుక ఉన్న అంతరార్థం వినగానే మోక్ష ముఖంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఆమె ఆలోచనలో పడింది.
కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా ఉండి, మెల్లగా నవ్వుతూ
"నిజమే మామ, నువ్వు చెప్పిన విషయం నేను కాదనలేను. భయపడి ఇంట్లోనే జీవితాంతం కూర్చోలేం కదా, పెళ్లి విషయంలో నాకున్న భయాల వల్ల నేను ఎప్పుడూ సానుకూలంగా ఆలోచించలేదు, కానీ మీరు చెప్పినట్లు, సమస్యలు వస్తాయేమోనని అసలు ప్రయత్నమే చేయకపోవడం తప్పు అని అర్థమైంది. కానీ "ముందు నేను మంచి ఉద్యోగం సంపాదించి, నా కాళ్ల మీద నేను నిలబడాలి, ఆ తర్వాత నన్ను, నా కెరీర్‌ను అర్థం చేసుకునే మంచి వ్యక్తి దొరికితే నువ్వు చెప్పినట్లే తప్పకుండా పెళ్లి చేసుకుంటాను" అని తన మనసులో మాట చెప్పింది. అక్క(పూర్ణ )మాటలు వినగానే పక్కనే ఉన్న చెల్లి (పూర్ణ) నవ్వుతూ ఆనందంగా, "అబ్బా! మొత్తానికి మామ దెయ్యం కథతో అక్క దారిలోకి వచ్చింది." అంటూ అక్కను ఆటపట్టించింది. పూర్ణ తర్వాత నవ్వుతూ కానీ మీరు చెప్పినది నిజంగా జరిగిందేమో అని భయపడ్డాను మీరు కథ అని చెప్పిన వరకు నాకు కథ అని అర్ధం కాలేదు అన్నది.
చివరకు వంటగది లో ఉండే ఇదంతా వింటూ బయటకు వచ్చిన అక్క, అప్పుడు బయట నుంచి వచ్చిన బావగారు కూడా ఆ సంభాషణ విని మేము కూడా నిజంగా జరిగిందేమో అని అనుకున్నాము అంటూ శంకర్ సమయస్ఫూర్తిని మెచ్చుకున్నారు. అందరూ నవ్వుకుంటూ కలిసి హ్యాపీగా భోజనం చేస్తూ, మోక్ష భవిష్యత్తు గురించి ఎన్నో ఆనందకరమైన కబుర్లు చెప్పుకున్నారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి