మీరంతా మన ఊరంతా
లెండి లెండి ఇల చెడును
ఎంతో కొంత మనమంతా !
మనమంతా కలిసి మెలిసి
మన చేతనైనదంతా చేద్దాం
ఇలలోన చెడు జరగకుండా
ఇక చూద్దాం యత్నం చేద్దాం !
కామం కైపెక్కిన కామాంధులు
అణ్యం పుణ్యం ఏమీ ఎరుగని
ఇంతుల పూబంతుల పై దాడి
చేస్తూ మస్తు సతాయిస్తున్నరు !
తన మన అని వారనుకోకుండా
వాయివరసలనూ చూడకుండా
మాన ప్రాణాలను దోచేస్తున్నరు
దారిదోపిడీ చేస్తూ బతికేస్తున్నరు
అందుకోసమే మీ అందరికీ మా ఈ పిలుపు
జాగ్రత్తకై మీ అందరికీ మేం చేసే మేలుకొలుపు
ఈ లంగలను మనమంతా కనిపెడదాం
కైపెక్కిన ఈ లైంగిక దొంగల పని పడదాం !
మానవత్వాన్ని మంటగలిపిన
దానవత్వాన్ని ఇంటి నిలిపిన
మానవ మృగాలున్న గేహాలను
కూల్చేద్దాం రండి పేల్చేద్దాంలెండి
చెడు సహవాసాలు చేస్తున్నట్టి
పరుల సొమ్ములు కాజేస్తున్నట్టి
పలువల అందరిని కనిపెడదాం
ఆ తులువల పని ఇక పడుదాం
అతివలు అబలలు కాదన్న విషయం
అసలు లేదు అందులో సంశయం
అందరికీ తెలుపుదాం ఇక ఈ సంగతి
అపర కాళీలై విజృంభిస్తే పట్టు అధోఃగతి !

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి