మనుషులు మారాలి (మానవత్వం చూపాలి): - అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగామ -9640748497


మనుషులను ప్రేమించలేని వస్తువు ప్రేమికులారా!

వ్యక్తిగత స్వార్థానికి పచ్చని ప్రకృతి ఆకృతిమార్చే పరమరక్కసులారా!

సత్యాహింసలు మరచిన అధర్మప్రబుద్ధులారా!

ప్రకృతిని వికృతిగా మార్చే వినాశనకారులారా!

భూమి కన్నా ఘనుడను నేనేనని విర్రవీగే అహంభావులారా!

డబ్బులకట్టలు చూసుకొని మురిసే డబ్బుమనుషుల్లారా!
 
దయ జాలి కరుణ కించిత్ కూడా చూపలేని నిర్దయులారా!
కాలాంతకులారా!

నీ దేహం
 నీ ధనం
శాశ్వతమ్మని తలంచే 
బుద్ధిహీనుల్లారా!
కాలాన్ని శాసిస్తున్నానని
ఊగిపోయే
వీరావేశులారా!

కన్ను మిన్ను కానక పేట్రేగిపోయే
పరమకంత్రీల్లారా!

భూతల్లి కన్న ముందేదియూలేదని
తెలుసుకోలేని
పరమమూర్ఖులారా!

కుటిలాత్ములారా!
క్రూరులారా!

పెనుతుఫాను
సుడిగాలి 
త్సునామీలు
పిడుగులు 
జలప్రళయాలు 
వరదలు
అగ్నిప్రమాదాలు 
స్వార్థపరుల ప్రయోజనకత్వపు
ప్రమాదపుఘంటికలు 

అమాయకుల బలిగొనే
బడా పారిశ్రామికవేత్తలారా!

భూతల్లిగర్భాన్ని చీల్చిసహజ నిక్షేపాల దోపిడికై
ఆదివాసులను హతమార్చి, గిరిజన తెగల గూడు చెదరగొట్టిన చరిత్రహీనులారా!

వందదాటితే బొందే కదరా
ఎందుకీ అత్యాశ 

అగ్గి వేస్తే బుగ్గి అవును డబ్బు
మంచి మానవత్వం 
దయా జాలి కరుణ వంటి దైవిక గుణాలు కలిగి ఉండు

జీవన వ్యాపార నిమిత్తం డబ్బు అవసరమే 
కానీ 
దోపిడీ చేసి మధ్యతరగతి, పేదల ఉసురు తీయకు

నువ్వు గతించిన తరువాత 
నువ్వు మహనీయుడవని
వేనోళ్ళ కొనియాడాలి
కానీ 
శాపనార్థాలు పెట్టేలా కాదు


కామెంట్‌లు