గుణవంతుడు నిజమైన ధనవంతుడు : - --గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు, సెల్ :9966414580

 

ఊటబావిలాంటి వాడు 
చూడంగా గుణవంతుడు 
అట్టి వాడు మహనీయుడు 
అనిశంబు పూజనీయుడు 

మంచి గుణం ఉన్నోడు 
నిజమైన ధనవంతుడు 
 లోభి కన్నా దారుణము 
పరికిస్తే గుణహీనుడు 

నిజ సంపద సుగుణాలే  
కలుగజేయు గౌరవము 
ఏది కావాలో! కోరుకో!
విలువైనది ఎన్నుకో!

గుణమున్న జీవితాలు 
కాంతులీను కాగడాలు 
అదే గనుక లేకపోతే 
కాలిపోయిన కాగితాలు 
చాలా చాలా వ్యర్థము 

కామెంట్‌లు