ధృతరాష్ట్రుని రాజనీతి ఉపదేశాలు! అచ్యుతునిరాజ్యశ్రీ
 

ధృతరాష్ట్రుడు అంధుడైనా గొప్ప రాజనీతిజ్ఞుడు.ధర్మజునికి ఇలా ధర్మాలు ఉపదేశించాడు. నాయనా ధర్మజా నీవు మంచి జ్ఞానవంతులైన బ్రాహ్మణులను మంత్రులుగా నియమించి రహస్య మంతనాలు చేయి మూసి ఉన్న గదిలో ఒకరిద్దరిని లోపలికి పిలిచి చర్చించు గడ్డి గాదం ముళ్ళు తుప్పల్లేని అడవిలో మంత్రాంగం చేయవచ్చు కోతులు పక్షులు మూర్ఖులు ఉన్నచోట ఎవర్ని రహస్య మంతనాలకు ఆహ్వానించవద్దు నగరవాసులు జానపదలు హృదయాలలో మంచి భావాలు పెంపొందించు నిష్పక్షపాతంగా న్యాయాన్ని చెప్పే వారినే న్యాయాధికారులుగా నియమించు లంచాలు తీసుకునే వారికి పర స్త్రీలను అపహరించే వారికి అబద్ధపు తీర్పు వారికి ధనాన్ని అపహరించే వారికి విహార స్థలాలకు ఆటంకం కలిగించే వారికి శిక్షణ శిక్ష వేయాలి సైనికులకు ఆనందోత్సాహాలు పెంపొందించాలి దూతలు గూఢచారులను సంధ్యాకాలంలో కలవాలి అర్ధరాత్రి మిట్ట మధ్యాహ్నం సమయంలో నీవు స్వయంగా ప్రజల సమస్యల్ని తెలుసుకోవాలి ఎవరికైనా వారి పని తనం చూశాకే ఉద్యోగం ఇవ్వాలి పరాక్రమవంతుడు స్వామి భక్తుడు హితేషి అయినవాడే సేనాపతిగా ఉండాలి వృత్తి పని వారికి ఏర్పాట్లు పోషణ చేయాలి శత్రువు యొక్క బలహీనతలను కనిపెట్టాలి మంచి గుణవంతులను సదా వెంట ఉంచుకోవాలి మంత్రులు దేశం దుర్గం సైన్యం సదా నీ కన్నులలో మెలిగేలా జాగ్రత్త తీసుకోవాలి శత్రువు బలహీనుడైతే జయించాలి అతడు బలగలవాడైతే సంధి చేసుకోవాలి దీనులు దరిద్రులపై మమతా కరుణ చూపాలి సామంత రాజును చంపరాదు దుష్టులను బంధించి శిక్షించాలి సంధికి అవకాశం లేనప్పుడు యుద్ధం చేసి చనిపోతే ముక్తి లభిస్తుంది. రాజుకి మిత్రబలం ధన బలం సైనిక బలం అతి ముఖ్యం రాజు ప్రజలను ధర్మబద్ధంగా పరిపాలిస్తే 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం అతనికి దక్కుతుంది🌹
కామెంట్‌లు