సామెతల ఊట -సునందమ్మ నోట: - వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 

 సామెత -401 : ఈత నేర్చిన వానికే నీటి చావు
**
ఎంత శిత్రం గద! "అన్నిట్ల వున్నవు దాసరీ- కన్నెట్ల బొయ్యింది దాసరి" అన్నట్టు. కొంతమందిరి యిష్యాలు యింటుంటే మన్సు కలికలి అయితది. ఏందో గీ యిచ్ఛింత్రం.గట్ల ఎందుకు జర్గుతదో ఏమో అవ్వా!''
 "ఏంది శెల్లే!ఎవలి ముచ్చెటి శెప్తున్నవ్? ఎన్ని విద్దెలు నేర్శినా కొంత మందిరికి గా యిద్దెలు కర్ణుడికి లెక్క సయిమానికి అక్కరకి రావు"ది ఆళ్ళకి శాపమో తల్రాతో? ఎంత యిశారిచ్చినా అర్తమే కాదు.
అవునవ్వా! గీ లోకంల నిముష నిముషాన్కి అంతుబట్టని శిత్రాలు శానా శానా జర్గుతున్నయి.గయ్యి సూశినప్పుడల్లా ఎందో గీ మడుసులు ఫలానా దాంట్లె ఉన్న తనకున్న గ్యానం ఇంగెవర్కి లేదని ఊకూకెనే మిడ్సివడుతుంటరుసేశే పన్లను నిర్లచ్చంగ ఏమైద్దిలే అని తేలిక శేత్తరు.శివరాకరికి  గందుట్లనే పానాలు పోగొట్టు కుంటరవ్వా?"
 అవును శెల్లే! గీ నడ్మల్నే కొందరు వొయిసు పోరలు పందెం గాశి పెద్ద తొవ్వల ఒకల్ని మించి ఇంకోలు ఉర్రడిగ కార్లు తోల్కుంట బొయ్యి గా ఉర్రడికి అద్పు తప్పి  గా పెద్ద తొవ్వల శెరిసగం జేసిన రోడుకు కొట్టుకొని శనాల్ల నిండు పానాలు పోగొట్టుకుర్రు. బాగ నేర్సుకున్న యిద్దనే గదాని ఏమైతదిలే అని నిర్లచ్చం జేత్తే. ఏమైంది శివరాకరికి పానం మీదికి తెచ్చుకుని పానాలు పోగొట్టుకుర్రు.
అవునవ్వా! గట్లనే శాన్నాళ్ళకింద ఒకాయిన పాముల్ని పట్టేటోడు, అద్దాల గదిల పాముల్తో ఉండి గయ్యేవో ఎన్కటి రికార్డుల కంటే ఎక్వ సాదిత్తననీ ,గా పాములున్న అద్దాల గదిలకి వొయ్యి వో పాము కాటెత్తె సచ్చివోయిండు.గదే శిత్రం గదవ్వా!"
 "అవును శెల్లే! మొన్న మన సవురయ్య మావ కొడుకు రెండు గిర్రల బండెక్కి బలాదూర్ తిరిగటోడు. గా బండిని శేతులు యిడ్సి నడుపుడు, కాళ్ళు పైకి బెట్టి నడుపుడు ఎక్కడిదిపో శానా ఎచ్చిడి ఎచ్చిడి సేశేటోడు. శివరాకరికి గట్ల తొవ్వల  గసుమంటి యిన్నాసాలు జేస్కుంట పోతూ అద్పు తప్పి టక్కరయ్యి పానం బోగొట్టుకుండు."
"అవును అవ్వా! మనూల్లె గౌరయ్య మావఁ తెల్సుగద. గాయిన ఈత యీది నట్లు ఎవ్వలు ఈదక పొయ్యే టోళ్ళు. గజీత గాడని ఊల్లె అందరు అనేటోళ్ళు. గిట్లనే మొన్న నదిల ఎట్లీత్తనో  సూడుమని దోత్తులతో పందెం కాసి.ఈదుకుంట ఈదుకుంట వొయ్యి సుడిగుండంల శిక్కుకుని సచ్చివొయ్యిండు."
అవును శెల్లే ! "ఈత నేర్శినోనికే నీటి సావు" అన్నట్టు నాకేమైతదనే నిర్లచ్చం, అజాగర్త నిండు పానాల్ని బలి తీస్కుంది.గందుకే మడిషికి అజాగర్త, నిర్లచ్చం ఉండొద్దు శెల్లే.గయ్యే యమ పాశాలై సుట్టుకుని పానాల్ని నడమంత్రంలోనే లాక్కవోతయి. మనం సూత్తున్నం గద ఎన్నెన్ని టక్కర్లైతున్నయో పానాలు బోతున్నయో! "
 "అవునవ్వా! ఇంట్లె వొంట కాడనైనా బయిట బండ్లు బావుల కాడ నైనా అతి శేత్తే పానాలకే ముప్పొత్తది."
"గంతే గాదు శెల్లే పైసలు బాగ సంపాయిత్తున్న నాకేందని యిర్రయీగి వొల్లు సోయి లేకుండ కర్సు బెట్టేటోళ్ళు సుత గా సంపాదన యిష్యంలో జాగర్త లేకపోతే.శివరాకరికి నానా యాతన్లు పడాల్సివొత్తది.
" గదండీ సంగతి" "ఈత నేర్చిన వానికే నీటి చావు" అంటే గిదే మరి. దేనికైనా అద్దు అదుపు,జాగర్త.అన్నీ వుండాలె."
కామెంట్‌లు