సుప్రభాత కవిత ; - బృంద


కమ్ముకున్న కలతలు తోసి 
నమ్ముకున్న విలువలతో 
దమ్ముతో  సాగితే వచ్చే 
గెలుపు ఉదయంలా ఉంటుంది!

మౌనంగా  వెలుగుతూ 
ప్రతి మదిని తాకుతూ 
అప్రతిహతంగా....
అందరినీ పలకరిస్తుంది!

మృదువుగానే అయినా 
చురుకుమనేలా....
యదార్థం ఇదేనని 
అర్థమయేలా  చెబుతుంది!

ఇష్టంగా  ధ్యేయం కోసం 
కష్టాలు పడినా...
విజయం చేతికందాక 
నిజమేంటో తెలుపుతుంది!

నిదానమైనా  విసుగులేక 
ప్రాధాన్యతలు మార్చుకోక 
విధానం ధర్మంగా ఉంటే 
విజయం మన వెంటే..!

స్వభావం మౌనమే 
ప్రభావం మాత్రం తెలిసి తీరు 
వైభవం దాని జోరు 
విజయం ఉదయం వంటిదే!

🌸🌸సుప్రభాతం 🌸🌸

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Wonderful mam 👌👌