నీవు అంటరాని వాడివని
మీతో మేము ఆడమని
స్నేహితులు అన్నప్పుడు
పట్టుదల పెరిగి ఆత్మవిశ్వాసంతో
పరీక్షన్నింటిలోను
ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణతను చెంది
ఉన్నత చదువులు చదివి
అందనంత ఎత్తుకు ఎదిగాను.
ప్రేమించిన పిల్లని పెళ్ళి చేసుకోవాలన్నప్పుడు
నీ చదువు కాదు మాకు ముఖ్యం
నిమ్నకులం వాడివని ఆమె తండ్రి నిరాకరించినప్పుడు
నా బాధ వర్ణనాతీతం.
బాధ్యతగల ఉన్నత అధికారిగా పనిచేస్తు
నా సహ ఉద్యోగులను
భేదభావం లేకుండా ఆప్యాయతగా చూసిన
కులం కారణంగా చాటుగా విమర్శ చేసినది విని నాలో నేనే కుమిలిపోయాను.
చివరికి దేవాలయంలో కూడా పూజారి
నేను క్రతువులో పాల్గొనడానికి అనర్హుడవని అన్న సమయాన
భగవంతుని నే సూటిగా ప్రశ్నిస్తున్నా
ఎందుకీ వివక్షత
ఎన్నాళ్ళీ వివక్షత ?
..............................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి