. వారాహీ మాత: - ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ -(పుష్యమి) -సెయింట్ లూయిస్-అమెరికా

 

సప్త మాతృకలలో ఐదోవతారముగా
విష్ణుమూర్తి  అవతారం వరాహ ముఖం కలిగి 
పంచమి నామంతో కూడా ప్రజలచే పూజింపబడే
శక్తి స్వరూపిణి వారాహీ మాత నీకు వందనం.
 
హస్తముల యందు హలము  ముసలం 
చక్రం ఖడ్గం కలిగి 
మార్కెండేయ పురాణం ప్రకారం 
మహిషాన్ని వాహనంగా చేసుకు 
ఉత్తర దిక్కుకు అది దేవతగా 
శైవ, వైష్ణవ,శక్తేయులు పూజించే మహిమాన్విత
వారాహీ మాత నీకు వందనం.

తాంత్రిక విద్యలతో  వామాచారులు 
రాత్రిపూట పూజించే శక్తి స్వరూపిణి 
బౌద్ధులు కొలిచే వజ్రవారాహీ, మరీచిలు 
నీ ప్రతి రూపాలే 
ఎన్నో చిక్కు సమస్యలున్నను నిను భక్తి శ్రద్ధలతో పూజింప 
పరిష్కరించే కరుణామయి
వారాహీ మాత నీకు వందనం...!!
.........................

కామెంట్‌లు