అన్నపూర్ణ తల్లీ ఆదుకోవమ్మా !: - " కావ్యసుధ "


పేదవాడి పరిస్థితి - 
"అన్నమో రామచంద్రా" అయ్యెలా ఉంది
ప్లేటులో మెతుకు లేక- 
కడుపు - కాలిపోయెలా ఉంది !

ప్రభుత్వం అంటోంది - 
"బియ్యం పుష్కలంగా -ఉన్నాయని"
ధైర్యం చెబుతోంది 
"భయం - వద్దని - వద్దని!"

కానీ - బయట - కథే - వేరలా ఉంది                                                         
రైస్ మిల్లర్ల - కుమ్మక్కు - బయట పడింది !
గోడౌన్లలో - బియ్యం - దాచేసి,                                                           
కృత్రిమ కొరత - సృష్టించారు !

ధరలు పెంచి - ఇష్టానుసారంగా అమ్ముకుంటున్నారు,
అధికారులు చూస్తున్నా                                                         
అమ్మేవాళ్లు అమ్ముకుంటున్నారు !
ఖజానా నింపుకుంటున్నారు 

అన్నపూర్ణ అన్న - ఈ దేశంలో....
అన్నం కొరతనా ?
అన్నం పెట్టే దేశంలో - 
ఆకలి చావులా ?
ఇది ఏమి ఘోరం -
ఏమి దారుణం, 
పేదోడి కడుపు మీద - 
ఇది - దోపిడీ కాదా?

అయ్యో... అన్నపూర్ణ తల్లీ...                                                      
ఆదుకోవమ్మా, నీ బిడ్డల 
ఆకలి - తీర్చవమ్మా!

మిల్లర్ల గుండెల్లో - కాస్త -
కరుణ నింపమ్మా, 
పేదోడి ఇంట - మళ్ళీ - 
అన్నం - పండించమ్మా!

ఇది ప్రతి పేదవాడి 
కడుపులోని ఆకలి కేక !!
======================
" కావ్యసుధ "
''వాజ్ఞ్మయ భూషణ''
" సాహితీ శిరోమణి "
 విశ్రాంత సీనియర్ జర్నలిస్ట్,
 హైదరాబాద్
కామెంట్‌లు