'ప్రజల సహకారంతోనే ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి'
రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఈర్ల సమ్మయ్య 

 



పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక ప్రాథమిక పాఠశాలలో గురువారం పేరెంట్స్ టీచర్స్ సమావేశాన్ని(పీటీఎం) ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఈర్ల సమ్మయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో పిల్లల అభ్యసన సామర్ధ్యాలు, ప్రగతిపై సమీక్ష జరిగింది. తల్లిదండ్రుల సమక్షంలో పిల్లలకు ప్రోగ్రెస్ కార్డులు అందజేశారు. తమ పిల్లలకు వచ్చిన మార్కులను చెక్ చేసి, వాటిపై తల్లిదండ్రులు సంతకాలు చేశారు. పిల్లల ప్రగతిని పరిశీలించిన తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, ప్రధానోపాధ్యాయులు ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందాలంటే ప్రజాప్రతినిధులు, ప్రజలు, పిల్లల తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరమన్నారు. నిషితంగా పరిశీలించినట్లయితే ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పిల్లలే అన్ని రంగాల్లో ముందంజలో ఉంటున్నారని, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో వారిదే పైచేయిగా ఉందని ఆయన అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి ఉచిత నాణ్యమైన విద్యను పొందాలని ఆయన సూచించారు. తరువాత పాఠశాల విద్యార్థి గొడుగు రాహుల్ కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు రాహుల్ కుమారును నిండు నూరేళ్లు వర్ధిల్లాలని దీవించి, ఆశీర్వదించారు. పిల్లలు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయినులు శ్రీవాణి,  స్రవంతి, సరిత, పిల్లలు వారి తల్లిదండ్రులు, గ్రామస్తులు పలువురు పాల్గొన్నారు.
కామెంట్‌లు