ధృతరాష్ట్రుడు తన సన్నిహితులను పిల్చి బాధగా అన్నాడు"మిత్రులారా! నావంశనాశనంకి,దుర్యోధనుని దుష్టబుద్ధికి మూలాధారం నేనే! కృష్ణుని,భీష్మ ద్రోణ కృపాచార్య, వ్యాసభగవానుడి హితోక్తులను పెడచెవినపెట్టి పాండవుల్ని నినాదాలు పెట్టాను.సంజయుడు గాంధారిమాటల్ని తోసిపుచ్చాను. 15ఏళ్లతర్వాత నాకళ్లు తెరుచుకొన్నాయి. నాపాపాలకి నిష్కృతిగా 4_8పూటలకొకసారి అన్నం తింటున్న. ఇది గాంధారికి మాత్రమే తెల్సు.మృగచర్మం ధరించి ధర్భాసనంపై జపం,నేలపై నిద్ర పోతున్నాను.నాభార్య కూడా ఇలాగే చేస్తోంది." అని ధర్మ రాజుతో అన్నాడు"కుంతీనందనా! నేనుదానధర్మాలు చేశాను.నేనునాభార్య అడవికెళ్లి తపస్సు చేసి శేషజీవితం గడిపేస్తాం.నీవు రాజువి. నీరాజ్యంలో జరిగే మంచిచెడ్డలకు ఫలం అనుభవించాలి." వెంటనే ధర్మరాజు శోకసంద్రంలో మునిగిపోయాడు. "పెదనాన్నా! మీరే నాతల్లిదండ్రులు! యుయుత్సుడు మీకన్నకొడుకు. అతన్ని రాజుని చేస్తే, నేనే అడవికిపోతా! గాంధారి కుంతి మా కన్నతల్లులే! నేనూ మీవెంటవస్తాను." ధృతరాష్ట్రుడు వయోభారం, దుఃఖంతో గాంధారి ఒడిలో వాలితే, ధర్మరాజు చల్లనినీటితో అతని ముఖం తుడిచి సేదతీర్చాడు. ఆవృద్ధునిలో కొత్త శక్తి వచ్చింది.వ్యాసుడు కూడా ధర్మ రాజుకి నచ్చచెప్పాడు. "నాయనా! ఆవృద్ధదంపతులకి అనుమతివ్వు.యుద్ధంలో లేదా అడవిలో చనిపోటమే రాజర్షిధర్మం." వ్యాసుడు వెళ్లిపోగానే ధృతరాష్ట్రుడు భార్యతో కల్సి భోజనం ముగించి ధర్మజునితో ఇలా చెప్పసాగాడు"నాయనా! సదా ధర్మాన్నే పాటించు.పండితులసాంగత్యం లో ఉండు,విద్వాంసులను సత్కరించు.ఇంద్రియాల్ని అదుపులో ఉంచుకో.గూఢచారులని నియమించి శత్రురహస్యాల్ని ఛేదించు. నగర ద్వారాలు విశాలంగా ఉండాలి." అంటూ రాజుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పసాగాడు🌹
ధృతరాష్ట్రుని నిర్ణయం!: - అచ్యుతునిరాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి