ఊ కొడుతూ వినే నీతికథలు లేవు
ఆరుబయట ప్రకృతి ఒడిలో అందరితో కలిసి
చెమట చిందిస్తూ ఆడే ఆటలు లేవు
నాలుగు గోడల మధ్యన ఏకాంతంగా
చేతిలోని సెల్‌ఫోనే ఆత్మీయ నేస్తంగా
వేళ్ల కదలికలతో సాగేవే అన్ని ఆటలు
చూపు మరల్చక చూసేవే చిత్రవిచిత్రాలు
పెద్దల మాటలు పెద్దగా రుచించక
గురువుల బోధనలు చెవికెక్కక
చదువుసంధ్యలపై ధ్యాసే కరువై
రీల్స్, షార్ట్స్ పైనే మోజులు పెరిగే
మత్తుపదార్థాలకు బానిసలవుతూ కొందరు
ఈజీ మనీ కోసం వెతుకుతున్నారు దారులు
లక్ష్యం మరచి సాగుతున్న జీవిత పయనాలు
ఏ గమ్యం చేరేను నేటి పిల్లల భవితవ్యాలు
మార్కుల వేటలో బాల్యాన్ని బలిచేయక
పోటీల ఒత్తిడితో పసి మనసులను నలపక
చెడు తోవలలో వారి అడుగులు పడనీయక
ప్రేమతో మంచి విలువలను నేర్పిస్తూ
వారి అభిరుచులకు ప్రోత్సాహమందిద్దాం
సాంకేతికతను సద్వినియోగం చేసుకునేలా
సృజనాత్మకతకు రెక్కలు తొడిగేలా
మానవత్వం, క్రమశిక్షణ పునాదులుగా
వారి భవితను వెలుగుల బాటగా తీర్చిదిద్దుదాం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి