''ఆ '' ఇద్దరు : - టి. వేదాంత సూరి ఆక్లాండ్ లో ఇంట్లో తప్ప బయట సంక్రాంతి సందడి అంతగా కనిపించదు. ఆఫీస్ వెళ్లే వారు వెళ్లారు. ఆద్య కూడా డే కేర్ కు వెళ్ళింది. ఇంట్లో ఆరియా తన పని తాను చేసుకుంటు ఆటల్లో నిమగ్నమైంది. 
పుస్తకాలు చదవడం, లేదా బొమ్మలు వేసుకోవడం వంటివి పిల్లలు  ఇప్పటి నుంచే ఇష్టపడుతుంటారు 
నెథర్లాండ్ లో  ప్రతి వారాంతం లో పిల్లలు రెండు పుస్తకాలు చదవాలన్న నిబంధన ఉంటుంది. అంటే వార్షిక పరీక్షల్లో ఆ పుస్తకాలు చదివి సమీక్ష రాసిన వారికి మార్కులు కూడా ఉంటాయి. ఇక్కడ మరో విషయం చెప్పాలి .రచయితలు కూడా  పిల్లల పుస్తకాలు వారి మనో భావాలకు అనుగుణంగా చాలా శ్రద్ధగా రాస్తారు, ప్రచురణ కర్తలు పుస్తకాలు ఆకట్టుకునేలా అచ్చు వేస్తారు. 
ఇక పిల్లలు తమ అభిరుచులకు అనుగుణంగా చదువుకుంటారు. కానీ పెద్దల లక్ష్యాలకు ఇక్కడ అంతగా ప్రాముఖ్యత ఉండదు. పిల్లలు ఎందులో రాణిస్తే వారికి అనుగుణంగా చదివిస్తారు. తమ అభిరుచులకు తగిన పనులు పిల్లలు ఎంచుకుని,  చేసుకుంటారు. పాఠశాలల్లో కూడా అదే పరిస్థితి ఉంటుంది. అందుకే బట్టీ పెట్టడాలు, కాపీ కొట్టడాలు , మానసిక ఒత్తిడి ఇక్కడ ఉండదు. పిల్లల ఆనందాలను పెద్దలు  స్వాగతిస్తారు కానీ తమ అభిప్రాయాలను పిల్లలపై రుద్దరు . ఫలితంగా సృజనాత్మకత , వ్యక్తిత్వ వికాసం అభివుద్ధికి ఈ చదువులు ఉపకరిస్తాయి. 
( మరిన్ని ముచ్చట్లు రేపు )