తుమ్ముల ఇల్లు.: - వసుధారాణి.
మా నరసరావుపేట లో కథ ఇది. చిన్నప్పటి నుంచీ నాకు నేనే ఇచ్చుకున్న పర్సనాలిటీ డెవలప్ మెంటు శిక్షణలో ఏదో ఒక తింగరి పని చేసి జనుల చేత తిట్లు తినటం ఒక భాగం. . ఇలా తిట్లు తినటం వల్ల మనకి దేన్నయినా భరించే శక్తి బోలెడు వస్తుందనే వెర్రి నమ్మకంతో ఉండేదాన్ని.అసలు నాకీ నమ్మకం ఏర్పడటానికి ఆ ఓబొజ్జ గణపయ…