అక్షరమాలికలు:-డా.రామక కృష్ణమూర్తి--బోయినపల్లి,సికింద్రాబాద్.

 ఏకపది:(శాంతి)
*******
1.మనసు నిమ్మళంగా ఉండి....
మనిషి సంతోషంగా ఉండడం!
2.సంతృప్తితో కలిగిన భావం....
మనసును స్థిమితపరచడం!
ద్విపది: (కోపం)
*******
1.అనుకున్నది జరుగక కలిగే వేదనలోంచి
పెల్లుబికిన‌ రగిలే సంవేదన.
2.అణచుకోలేని భావాల విస్ఫోటనంతో మొదలై
వెల్లువలా ముంచేసే నిరసనజ్వాల.
త్రిపది(రణం)
******
1.కోరికలు గుర్రాలతో పోటీపడి పరుగెత్తుతున్నాయి.
మనసు పెట్టే ఆకర్షణలకు లోనై
మనుషులిచ్చే తాత్కాలిక గుర్తింపులకు బానిసై.
2.ఆశలు వేసే వలల్లో చిక్కిపోయినట్లునట్లున్నావు.
ఆరాటంతో,శాంతిని ‌కోల్పోయి
నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నావు.