" వ" గుణింత గేయం:---మచ్చ అనురాధ--తెలుగు భాషోపాధ్యాయురాలుజి.ప.ఉ.పాఠశాల కుకునూర్ పల్లి, కొండపాక మండలం , సిద్దిపేట జిల్లా.

 వక్రతుండ గణపతి ని
వాగ్దేవతా సరస్వతిని
విరులతో పూజించుదాం
వీరులుగా తీర్చిదిద్దుమని
వున్నతంగ నిలుపుమని
పూర్ణము దేవతలందరిని
వృద్ధి చేయు మమ్ములను
వౄ ను ఉచ్చరించండి
వెనుక వేయు ధనమును
వేమారు యోచించుము
వైజ్ఞానికులుగా యెదగాలి
వొయ్యన  నేర్చుకోవాలి
వోఢన్యము  ఏదిలేదు
"వౌ "ను  పలకండి
వందనాలు అందరికీ.

కామెంట్‌లు