అమ్మ లా ఆదరించి ,
నాన్న లా నమ్మకాన్నిచి,
స్నేహితుడి లా సేవించి,
మిత్రుడి లా మంచి నీ నేర్పి
,నా రూపానికి పేరుపెట్టిన
ఓ గురువు నీకుపాధభివందనం
తెలివి తేటలు తో తెలుగు,
హిత బోధనలతో హిందీ,
అందరిలో చురుగా ఉండాలని ఆంగ్లం,
గరం గరం గా గణితం
జీవితం ఓ జీవశాస్త్రం
బ్రతకడానికి భౌతికశాస్త్రం
సమాజం ఓ సాంఘీకశాస్త్రం
ప్రతి పని ఓ పద్ధతి ప్రదానోపాధ్యాయం
మా అందరి తొలి మెట్టు మీరు
అందరూ మా ముందు ఉండి నడిపిస్తున్నారు
మా తప్పు లను మన్నిస్తూ
మా అందరినీ ఆనందంగా చూస్తుంటారు మీరు మా అదృష్టం
గురువులందరికి వందనం :-స్వాతి కాడబోయిన నీర్మల
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి