ఆటవెలది పద్యములు.;-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర

 1.
కాలిపోవు భవిత కాలుష్యమందున
చెట్టుచేమలున్న జీవముండు
ధరణి తాప మపుడు తగ్గుట ఖాయము.
నేడు మొక్క నాటి నీరు పెట్టు./

2.
తెల్లవారి లేచి యిల్లును దిద్దెడి
తల్లి కన్న భువిని దైవ మెవరు?
తల్లి సేవ చేయు తనయుండు ధన్యుడు
మంచి మాట నెపుడు మరువ రాదు./
3.
సాధులక్షణముల చక్కగా సాధించు 
మంచి సూక్తి నిన్ను మార్చి వేయు
పెద్దవారి మాట పెన్నిధి వంటిది
తెలుసు కొనుమ!నీవు తెలుగు బాల /
---------------------

కామెంట్‌లు