వైద్యురాలిగా అమ్మ;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961
 ప్రకృతిలో ఉన్న  పంచభూతాల (ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి) తో ఏర్పడిన ఈ శరీరం  ప్రకృతిలో జీవితో కలిసి  సుఖమయ జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేస్తోంది. మనం ఒకటి తలిస్తే  ప్రకృతి మరొకటి తలుస్తోంది  అని పెద్దలు చెప్పిన సూక్తి  దానికి ఈ క్షణం వరకు ఎప్పుడూ భిన్నంగా జరగలేదు.  ప్రకృతి అనుగ్రహించిన స్థితే  కనుక ఆ వచ్చిన అవాంతరాలను మనం ఎలా తట్టుకోవాలి అన్న విషయాన్ని  సమగ్రంగా పరిశీలించినట్లయితే  మన పద్ధతులలోనే  జబ్బులు రాకుండా  ఉండేందుకు  ఏర్పాటు చేశారు మన పెద్దలు. ఒకవేళ  రోగనిరోధక శక్తి తక్కువగా ఉండి  అనుకోకుండా ఏదైనా జబ్బు చేస్తే దానికి ఎలాంటి నివారణ పద్ధతులు ఉన్నాయో కూడా అమ్మ చెబుతుంది బిడ్డకు జన్మనిచ్చిన తల్లి. ఆ తల్లికి బిడ్డను సంరక్షించుకునే బాధ్యత ఉండదా. అందుకే  ప్రథమ గురువు గానే కాక భగవత్స్వరూపంగా భావించి అమ్మ పాదాలకు సాష్టాంగ నమస్కారం చేయడం.
కొంతమంది పిల్లలకు  స్వతహాగా వారికి కొన్ని అలవాట్లు వస్తాయి  అది పరిసర ప్రభావం కావచ్చు సన్నిహితుల ప్రోత్సాహం కావచ్చు  ఆలస్యంగా పడుకోవడం  మరీ ఆలస్యంగా లేవడం  దీనిని తండ్రి గమనించడు  అనునిత్యం బిడ్డను అంటిపెట్టుకొని అతని మంచిచెడ్డలను చూసేది తల్లి కనుక  ఆమె ఆ బాధ్యతను స్వీకరించి ఆ బిడ్డకు తొందరగా లేవాలి అన్న ధర్మసూక్ష్మం కూడా తెలియదని మందలిస్తు ఎంతో సున్నితంగా వారి మనసు బాధ పడకుండా  చెప్పాలి  ఆ తర్వాత చేయవలసిన పనుల అన్నిటిని కూడా క్రమబద్ధంగా చేయించే  ఏర్పాట్లు తల్లి మాత్రమే తీసుకుంటుంది  అది ఆమెకు వెన్నతో పెట్టిన  విద్య  కనుక అమ్మ దగ్గర ఉన్న చొరవ  మమకారం  నాన్న దగ్గర పిల్లలకు ఎక్కువగా ఉండదు. అందువల్ల తల్లి తమకు  స్కూల్ టీచర్. కొంతమంది పిల్లలలో  చిన్నతనంలోనే గజ్జి కురుపులు వస్తూ ఉంటాయి  ఎంతమంది వైద్యులు చూసినా దానికిసరైన మందులు  దొరకవు  అప్పుడు ఆమె వైద్యుని పాత్ర తీసుకుంటుంది  నాన్నా నువ్వు ఉదయమే లేచి  కాలకృత్యాలు తీర్చుకున్న తరువాత  మన సావిడికి వెళ్లి  అక్కడ ఆవులు వేసిన పేడ  ఉంటుంది  ఆ పేడ పైన ఆవు  మూత్ర విసర్జన కూడా చేస్తుంది  ఆ ప్రాంతం రొచ్చు గా తయారవుతుంది  అక్కడకు వెళ్లి  నీ రెండు చేతులను దానిలో కాసేపు ఉంచి ఆ ప్రాంతం మొత్తాన్ని శుభ్రం చేసి పెంట పోగుల మీద కు చేర్చు నీకు వచ్చిన ఆ గజ్జి కురుపులు  మూడు నాలుగు రోజులలో తగ్గటమే కాదు ఆ కురుపులు వచ్చిన గుర్తులు కూడా లేకుండా  శుభ్రంగా పాత చేతులు ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి అని సలహా ఇస్తుంది  అలా  ఇంటివైద్యాన్ని అమ్మ చేయడంతో  ఆ కుటుంబం  ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు....


కామెంట్‌లు