నూతన వధువు;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 పుట్టింట్లో అలా అమాయకంగా ఉన్న అమ్మాయి అందరి పొగడ్తలను పొంది పరిణతి చెందిన పరిపూర్ణ స్త్రీగా వెలుగొందడానికి ఎంత సమయం పట్టింది మౌనంతో వాటినన్నిటినీ ఎలా బరించింది అదే స్త్రీ తత్వం అదే మాతృత్వం  ఆమె చేయవలసిన మొదటి పని  భర్త ఇష్టాయిష్టాలను తెలుసుకుని  అతని మాటల్లో అతని చెప్పడు కనుక అతని చేతలను చూసి తెలుసుకోవడం దానిని అనుసరించి భర్తను తన వాడిని చేసుకుంటుంది. దాని కోసం ఎత్తులకు పై ఎత్తులు వేసి శత్రువులను చిత్తుచేసిన  నాయకురాలు నాగమ్మ ఎలా జీవితంలో విజయాన్ని ఎలా సాధించిందో  అలా ఈ భార్య భర్తను జయిస్తోంది.  అత్తమామలకు చాలా దగ్గరగా ఉండి ముందు వారి పనులు  ఎలా ఉంటాయో గమనించి దానికి అనుగుణంగా ఏం చేయాలో అది చేస్తుంది  ఎలాంటి మాటలు మాట్లాడడం వారికి ఇష్టం  అని తెలుసుకుని ఆ ప్రకారంగా నడుచుకోవాలి  అంతకు మించిన ఆసిధార వ్రతం మరొకటి ఉంటుందా.
అత్తమామలు అంటే  ముసలితనంలో ఉన్నవారు జబ్బులతో బాధపడుతున్న వాళ్లు  వారికి కావలసిన సకల సౌకర్యాలు చేయవలసిన బాధ్యత తాను స్వీకరించి ఏ క్షణాన వారికి ఏ మందు ఇవ్వాలి  ఎంత పరిమాణంలో ఇవ్వాలో తెలుసుకొని అలా చేయడం ఆమె పని. వారు తినతగినవి, తినకూడనివి చాలా ఉంటాయి వాటిని అన్నిటినీ ప్రత్యేకించి తినవలసినవి మాత్రమే  ఆ సమయానికి అందించాలి  రాత్రి పడుకునే ముందు వారికి కాళ్లు నొప్పులుగా ఉంటే  కాళ్ళు వొత్తి వారు నిద్రపోయే అంతవరకు జాగ్రత్తగా ఉండాలి.  తన గదికి వచ్చి భర్తకు కావలసిన సౌకర్యాలను అన్నిటిని అమర్చి పెట్టాలి.  అతని సుఖాలన్నిటిని తీర్చాలి ఇన్ని పనులు చేయాలి అంటే  ఒక యంత్రంగా చేయాలి తప్ప మనిషి టైప్ లో చేయడం సాధ్యం కాదు  మనిషిగా అన్ని పనులు ఎంతో ఓపికగా చేసుకున్నది కనుక ఆమె కు అంత గౌరవం. ఉదయం లేవగానే మొదట చేయవలసిన పని పిల్లలను లేపడం వారి  కార్యక్రమాలన్నీ పూర్తి చేయించడం  వారి కడుపు నింపి బడికి పంపడం  ఈ లోపు వాడు ఎన్ని చిలిపి కోరికలు కోరతారో ఎంతో గారంగా వాడు కోరుకున్నవన్నీ ఓపికతో విని అలాగే అని సర్ది చెప్పడం  వారి పుస్తకాలు సర్దడం కూడా. వారికి క్యారీయర్ చేసి బడికి పంపడం. వారు ఒక్కొక్క కోరిక కోరినప్పుడు ఎంత కోపం వస్తుందో తెలుసు కదా.  అయినా తమాయించుకుని  ఆఫీసుకెళ్ళే టైం అవుతుందని భర్త గోల వాడి తిట్లు తినాలి. అటు ముసలివారి  కేకలు  వారికి కావలసినవన్నీ సమయానికి సమకూర్చాలి  ఇంత సహన మూర్తి  ఈ ప్రపంచంలో ఎక్కడైనా మనకు కనిపిస్తుందా అందుకే అమ్మంటే ప్రతి ఒక్కరి ఇంట్లో వారికే కాదు వీధిలో వారికి కూడా ఇష్టం  ఇంటి గౌరవాన్ని కాపాడే ఏకైక వ్యక్తి అమ్మే కనుక.


కామెంట్‌లు