అబల (గజల్ లహరి);---కవిరత్న నాశబోయిన నరసింహ (నాన), ఆరోగ్య పర్యవేక్షకులు, 8555010108.
అబలలే సబలలై గెలిచేది ఎప్పుడో?!
మానవత సమానత చాటేది ఎప్పుడో?!

అడుగడుగు మృగాలే  వేటాడి చంపుడే
మహిళగా మనగలిగి గెలిచేది ఎప్పుడో?!

తామసిని తరిమేసి జాబిలై వెలగాలి
కాముకుల చెర నుంచి వీడేది ఎప్పుడో?!

చట్టాలు ఎన్నున్నా మార్పేమి లేదాయె
మది నిండ మలినమే కడిగేది ఎప్పుడో?!

కలకంఠి అందాలు అనురాగ బంధాలు
అతివలను అమ్మగా కొలిచేది ఎప్పుడో?

సుమ తరువు కరువైన ఎడారిగ ఈనేల
లతాంగుల రక్షణకు నిలిచేది ఎప్పుడో?!

మగువైన మగైనా ఒకటేలె జీవితం
నానకవి నివేదన తీరేది ఎప్పుడో?!

(11అక్టోబర్ ,అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా)


కామెంట్‌లు