అసుర ప్రవృత్తికి చరమగీతం;-కవిరత్న నాశబోయిన నరసింహ (నాన), ఆరోగ్య పర్యవేక్షకులు,8555010108
రండి! వరుస క్రమంలో ఒక్కో దీపం వెలిగిద్దాం!!
మదిలో దాగిన ఒక్కొక్క దుర్గుణం దగ్ధం చేద్దాం
దీపం పరబ్రహ్మ తేజోమయ స్వరూపం
దివ్యమైన దీపకాంతి సోకిన మన దేహం
అజ్ఞాన తిమిరం తరిమి జ్ఞానజ్యోతిగా వెలగాలి!

ఆశ్వయుజ చతుర్థశి నరకాసుర సంహారం
అబల సబలని చాటే సత్యభామ సాహాసోపేతం
కష్టాలు తొలగాలని వేడుకునే దివ్య దీపోత్సవం
అధర్మంపై ధర్మపోరాట విజయ పతాక పర్వదినం
ప్రతికూలతని సానుకూల శక్తిగ మార్చే అద్భుతం!

జిలుగు వెలుగుల నవ్య వైభవ అద్భుతకేళి
అఖండ దీపమాల అలంకరించిన గృహావళి
సౌభాగ్యవతులు కేదారీశ్వర వ్రతమాచరించే దినం
శివుడు అర్ధనారీశ్వరుడై అన్యోన్యత చాటిన వైనం
దుఃఖపు ఛాయలు దూరం తరిమే ఆనంద రవళి!

అసుర ప్రవృత్తికి పాడాలి చరమ గీతం
చెడు సమాధి చేసి పరిమళించాలి మానవత్వం 
అవినీతి అరికట్టే జ్ఞాన నేత్రం తెరవాలి
అనుక్షణం అంతర సంస్కార ఉద్దీపన జరగాలి
విశ్వం దేదీప్య శోభాయమానంగా విలసిల్లాలి! 

(దీపావళి శుభాకాంక్షలతో..)
🪔🪔🪔🪔♦️🪔🪔🪔🪔


కామెంట్‌లు