శరత్ చంద్రికా రాత్రులు;-కవిరత్న నాశబోయిన నరసింహ(నాన), ఆరోగ్య పర్యవేక్షకుడు,8555010108.
భువి దివి యగు నీఆగమనం పరమానందం
నీ స్పర్శ సకల జీవుల మనస్సు ప్రశాంతం 
కలం గళం సంగీత నాద మధుర స్వప్న లోకం

నైట్ క్వీన్ కలువ భామలు విరిసే తన్మయంగా 
శుక్లపక్ష చంద్రకళల దినదిన ప్రవర్ధ మానం 
శీతలం శ్వేత వర్ణం కలబోసిన సుందర రూపం

అలల లయల హొయలొలికే వెన్నెల గోదారి
తళుకు బెళుకు సితారల నయనానందకరం
కౌముది జలపాతం కనువిందు కార్తీకం

విరుల కురుల పడతి పరవశాన ప్రమోదం
సుమ సుధలనాస్వాదించ భ్రమరంల జోరు
అనురాగ హృదయానందం పంచే నీగమనం

మల్లె పరిమళా లెదజల్లే నీకై చకోర పక్షులమై
ఇంతి సిగన పూబంతీ శ్వేతకాంతుల చేమంతీ
మమతా మాధుర్యపు చల్లనిచూపు నీ దీవెన

చలువ చంద్ర ప్రభల చిరునవ్వులు రువ్వి
శ్రమ మరిపించి మది మురిపించే చెలీ 
శశి కిరణామృత ధార వర్షించే నిర్మల మది నీది

చీకటి కాటుక చిదిమి వెండి దీపిక వెలిగించి
పారిజాత పుష్పాలు పరిమళాన్ని విరాజిల్లు
శరత్ చంద్రికా రాత్రులు ఆనంద స్మృతులుకామెంట్‌లు